లివివ్: రష్యా దాడిలో క్యాన్సర్ హాస్పిటల్ ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. మికోలైవ్ పట్టణంలో ఉన్న హాస్పిటల్‌తో పాటు పలు నివాస బిల్డింగ్లు కూడా ధ్వంసం అయ్యాయి. భారీ ఆయుధాలతో రష్యా ఆ నగరంపై దాడి చేసింది. క్యాన్సర్ హాస్పిటల్‌పై దాడి జరిగిన సమయంలో ఆ ఆస్పత్రిలో వందల సంఖ్యలో పేషెంట్లు ఉన్నట్లు డాక్టర్ మాక్సిమ్ బెజ్నోసెంకో తెలిపారు. అయితే దాడిలో ఎవరూ చనిపోలేదని ఆయన చెప్పారు. దాడి వల్ల బిల్డింగ్ డ్యామేజ్ అయిందని, కిటికీలు పగిలినట్లు ఆయన అన్నారు. కీవ్ నగరానికి దక్షిణ దిశగా 470 కిలోమీటర్ల దూరంలో మికోలైవ్ పట్టణం ఉంది. బుధవారం మారిపోల్లో ఉన్న మెటర్నిటీ ఆస్పత్రిపై రష్యా దాడి చేసిన విషయం తెలిసిందే.