Cruise Missiles: రష్యా ప్రయోగించిన 15 క్రూయిజ్ మిస్సైళ్లను కూల్చేశాం: ఉక్రెయిన్
Cruise Missiles: 15 క్రూయిజ్ మిస్సైళ్లతో కీవ్‌పై రష్యా అటాక్ చేసింది. అయితే ఆ క్షిపణులన్నింటినీ కూల్చివేసినట్లు ఉక్రెయిన్ అధికారులు స్పష్టం చేశారు. నాలుగు బాంబర్ విమానాల ద్వారా రష్యా ఆ క్షిపణులను వదిలినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది.
కీవ్: రష్యా సంధించిన 15 క్రూయిజ్ మిస్సైళ్ల(Cruise Missiles)ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. రాజధాని కీవ్‌ను టార్గెట్ చేస్తూ రష్యా ఆ క్షిపణులను వదలినట్లు తెలుస్తోంది. తమ దేశానికి చెందిన వైమానిక దళం ఆ మిస్సైళ్లను కూల్చినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఈ అటాక్‌లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. కీవ్‌కు చెందిన సీనియర్ మిలిటరీ అధికారి షెరియే పొప్కో ఈ విషయాన్ని చెప్పారు.
కాస్పియన్ సముద్ర ప్రాంతం నుంచి నాలుగు బాంబర్ విమానాల ద్వారా ఆ క్షిపణులను రష్యా ప్రయోగించినట్లు ఉక్రెయిన్ అధికారి తెలిపారు. ఆదివారం రాత్రి భారీ స్థాయిలో రష్యా తన డ్రోన్లను లాంచ్ చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఉప్పెనలా వచ్చిన డ్రోన్లు, మిస్సైళ్ల వల్ల ఒకరు మృతిచెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు.
రష్యా విక్టరీ డే సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని గంటల ముందే ఈ మిస్సైల్ అటాక్ జరిగినట్లు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

