కీవ్: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చమురు ఎగుమతులకు దేశంలోనే అతిపెద్ద హబ్ ‘ఉస్త్-లుగా’ ఓడరేవుపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. బాల్టిక్ సముద్ర తీరంలోని ఈ పోర్టులోని గ్యాస్ టెర్మినల్‌పై జరిగిన దాడితో భారీగా మంటలు చెలరేగాయి. ఫలితంగా అక్కడి కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. తాజా దాడిలో చమురు శుద్ధి యంత్రాలు దెబ్బతినటంతో రష్యా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనున్నది. దాడి ఘటనను ఉత్తర లెనిన్గ్రాడ్ గవర్నర్ అలెక్సాండర్ డ్రోజెన్కో నిర్ధారించారు. ఈ ప్రాంతంలో మొత్తం 36 డ్రోన్లను కూల్చివేశామని అన్నారు. దీనిని ఉగ్రవాద చర్యగా రష్యా అభివర్ణించింది.