Strait of Hormuz | డొనాల్డ్ ట్రంప్‌నకు బ్రిటన్ షాక్.. హార్ముజ్ దిగ్బంధానికి మద్దతు ఇవ్వబోమని స్పష్టం
Strait of Hormuz : హార్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అయితే, ఈ విషయంలో అమెరికా మిత్ర దేశంగా పేరున్న బ్రిటన్ షాకిచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది.
Strait of Hormuz : హార్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అయితే, ఈ విషయంలో అమెరికా మిత్ర దేశంగా పేరున్న బ్రిటన్ షాకిచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో తాము ట్రంప్‌నకు మద్దతు ఇవ్వడం లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం బీబీసీతో మాట్లాడారు.
హార్ముజ్‌ను దిగ్బంధించాలంటూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. తమ దేశం ఉద్రిక్తతలు పెరగాలని కోరుకోదని, స్థిరత్వానికే ప్రాధాన్యమిస్తుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన నౌక రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిని మూసేయకుండా, సురక్షితంగా నౌకలు రవాణా జరిగేలా చూడాలన్నారు. హార్ముజ్‌ను సైనిక చర్య ద్వారా అడ్డుకోవడంకన్నా, దీన్ని పూర్తిస్థాయిలో ఎలా అందుబాటులోకి తీసుకురావాలో ప్రయత్నించాలని సూచించారు. తమ దేశ నావికా దళం ఇతర నౌకల్ని, మార్గాల్ని అడ్డుకోవడం కన్నా.. సురక్షితంగా నౌకల రవాణా జరిగేలా చూడటం కోసమే పని చేస్తుందని స్టార్మర్ వివరించారు. అంతకుముందు కూడా కీర్ స్టార్మర్.. ఇరాన్ యుద్ధంపై స్పందించారు. తాము ఇరాన్ యుద్ధంలో అమెరికాతో కలిసి పాల్గొనడం లేదని తెలిపారు.
సరైన ప్రణాళిక, చట్టపరమైన అవసరాలు లేకుండా యుద్దంలోకి దిగబోమని చెప్పారు. భారీ యుద్ధంలో పాల్గొనడం కన్నా, జాగ్రత్తగా, స్వతంత్రంగా వ్యవహరించడమే ఈ పరిస్తితిల్లో మంచిది అని అభిప్రాయపడ్డారు. ఇక, హార్ముజ్‌ను అమెరికా దిగ్బంధించే ప్రక్రియ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు మొదలవుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

