ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని

లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. గతంలో కరోనా బారినపడిన ఆయన శుక్రవారం ఆస్ట్రాజెనెకా టీకా మొదటి డోసు తీసుకున్నారు. ‘నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాను. వ్యాక్సిన్ సాకారమయ్యేలా దోహదపడిన శాస్త్రవేత్తలు, ఎన్హెచ్ఎస్ సిబ్బంది, వాలంటీర్లందరికి ధన్యవాదాలు. వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిది’ అని బోరిస్ ట్వీట్ చేశారు.
బ్రిటన్ ప్రధాని గతేడాది కరోనా బారినపడిన విషయం తెలిసిందే. 2020 ఏప్రిల్ నెలలో సెయింట్ థామస్ దవాఖానలో చికిత్స తీసుకున్నారు. కాగా, తాను ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకుంటానని జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. కరోనా వైరస్‌ను కట్టడిచేయడానికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపడుతుందని ఆమె వెల్లడించారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడంతో యూరప్‌లోని చాలా దేశాలు టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

