సెక్స్ స్కాండల్ ప్రకంపనలు : సంక్షోభంలో బొరిస్ జాన్సన్ సర్కార్
యూకేలో కలకలం రేపిన సెక్స్ స్కాండల్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
లండన్ : సహచరుడిపై లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలపై చూసీచూడనట్టు వ్యవహరించిన బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సెక్స్ స్కాండల్ కాస్తా తన సర్కార్ చుట్టూ ఉచ్చు బిగించడంతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతన్నారు. యూకేలో కలకలం రేపిన సెక్స్ స్కాండల్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాన్సన్ కేబినెట్ నుంచి ఇద్దరు కీలక మంత్రులు రిషి సునక్, సాజిద్ జావిద్ నిమిషాల వ్యవధిలో రాజీనామా చేయడంతో జాన్సన్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ప్రధాని నాయకత్వం పట్ల విశ్వాసం లేదని వారు కేబినెట్ నుంచి వైదొలిగారు.
తన ప్రభుత్వంలోని సీనియర్ సభ్యుడి లైంగిక దుష్ర్పవర్తన విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయానని జాన్సన్ అంగీకరించిన అనంతరం ఇద్దరు మంత్రులు తప్పుకున్నారు. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లు, ఆర్ధిక మందగమనం, ఉక్రెయిన్ వార్ ఇతర సవాళ్లను దీటుగా సమర్ధవంతంగా ఎదుర్కోవాలని ప్రజలు ఆశిస్తున్నారని, మంత్రిగా ఇదే తన చివరి ప్రస్ధానమని, ఈ ఆశయాల కోసం పోరాడేందుకు తాను ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నానని సునక్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ఇక బొరిస్ జాన్సన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం లేదని, తానూ అదే అభిప్రాయంతో ఉన్నానని సాజిద్ జావిద్ స్పష్టం చేశారు. మనం ఎప్పుడూ ప్రజలను మెప్పించలేకున్నా దేశ ప్రయోజనాల కోసం సమర్ధంగా వ్యవహరించాలని, జాన్సన్ నాయకత్వంలో ప్రస్తుత దుస్ధితి మారుతుందని తాను అనుకోవడం లేదని రాజీనామా లేఖలో జావిద్ పేర్కొన్నారు.
అసలేం జరిగింది..!
2019లో లైంగిక దుష్ర్పవర్తన ఆరోపణలు ఎదుర్కొన్న క్రిస్ పించర్కు కేబినెట్లో సీనియర్ సభ్యుడిగా జాన్సన్ నియమించడం బ్రిటన్లో దుమారం రేపింది. పించర్పై లైంగిక ఆరోపణల విషయం జాన్సన్కు తెలియదని జులై 1న బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇది వాస్తవం కాదని, ఈ ఆరోపణల గురించి ప్రధానికి తెలుసని ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రధాని అసత్యం చెబుతున్నారని 2015 నుంచి 2020 వరకూ బ్రిటన్ విదేశాంగ కార్యాలయంలో సీనియర్ అధికారిగా పనిచేసిన సైమన్ మెక్ డొనాల్డ్ ఆరోపించడం కలకలం రేపింది. ఆపై పించర్ను ప్రమోట్ చేసే విషయంలో పొరపాటు జరిగిందని బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ అంగీకరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Boris Johnson
- Crisis
- ministers
- quit
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

