Today History: పేదరికంలో పుట్టారు.. అయితేనేం, ప్రపంచ ఫుట్‌బాల్ ఆటను శాసించారు. ఒకప్పుడు బూట్లు కొనేందుకు డబ్బు లేని ఈ ఇద్దరు ఆటగాళ్లు అనంతర కాలంలో వేల కోట్లు సంపాదించి భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలిచారు. వారే క్రిస్టియానో రోనాల్డో.. నేమార్. రోనాల్డో 1985 లో జన్మించగా.. 1992 లో నేమార్ పుట్టారు. ఆశ్చర్యకరంగా ఇద్దరూ ఒకే ఆటను ఎంచుకుని.. ఆ ఆటలో రారాజులుగా వెలుగొందారు. రోనాల్డో- నేమార్‌ల బాల్యం పేదరికంలో ఉండేది. కానీ పేదరికం వారి అభిరుచిని అడ్డుకోలేకపోయింది. ఇద్దరూ ఉత్తమ ఆటగాళ్ల లీగ్‌లోకి ప్రవేశించడమే కాకుండా అత్యంత ధనవంతుల ర్యాంక్‌లో కూడా నిలిచారు.
క్రిస్టియానో రోనాల్డో పోర్చుగల్‌లోని అత్యంత పేద కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి తోటమాలి, తల్లి ఇండ్లల్లో వంట, పాచి పనులు చేసేది. రోనాల్డో కుటుంబం టిన్ రూప్ ఇంట్లో నివసించేది. తండ్రి మద్యానికి బానిస కావడంతో.. ఇంటి నిర్వహణ బాధ్యత తల్లి భుజాలపైనే పడింది. నలుగురు తోబుట్టువులలో రోనాల్డో చిన్నవాడు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల మధ్య రోనాల్డో పాఠశాలలో చేరాడు. ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా మారడానికి రోనాల్డో ప్రయాణం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. రోనాల్డో మనసు చదువు కంటే ఫుట్‌బాల్ ఆడటంపైనే ఎక్కువ ఆసక్తిని కనబరిచింది. ఎనిమిదేండ్ల వయస్సులో స్థానిక జట్టు కోసం ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించిన రోనాల్డో.. అద్భుతమైన ప్రదర్శన కారణంగా ఆ వెంటనే ప్రపంచ అండర్-17 జట్టులోకి ఎంపికయ్యాడు. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్లో చేఇరన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. రియల్ మాడ్రిడ్ క్లబ్ తరఫున చాలా ఏండ్ల పాటు ఆడారు.
మరో ఫుట్‌బాల్ ఆటగాడు నేమార్ బాల్యం కూడా కడు పేదరికంలోనే గడిచింది.
క్రిస్టియానో రోనాల్డో మాదిరిగానే నేమార్ డీ సిల్వా శాంటోస్ జూనియర్.. ముద్దుగా నేమార్ జూనియర్ అని పిలుచుకుంటారు. ఈయన కుటుంబం సావో పాలోలోని మోగి దాస్ క్రిజెస్ అనే మురికివాడలో నివసించేది. అతడి తండ్రి కూడా ఫుట్‌బాల్ ఆటగాడు. కానీ, పేదరికం కారణంగా అతడు ఫుట్‌బాల్ ఆటగాడు కాలేకపోయాడు. అయినప్పటికీ తన ప్రతిభతో కొడుకు నేమార్‌ను గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడిగా చేయడంలో కృతార్థుడయ్యాడు. పేదరికం కారణంగా చాలా సార్లు ఇంటి కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితితో నేమార్ కుటుంబం జీవించింది. 11 సంవత్సరాల వయస్సులో బ్రెజిల్ ప్రసిద్ధ ఎఫ్‌సీ శాంటోస్ క్లబ్లో చేరిన నేమార్.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 2009 లో అండర్-17 బ్రెజిల్ జట్టుకు నేమార్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2013లో బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్లో చేరిన నేమార్.. అక్కడ మరొక గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీతో కలిసి ఆడాడు. 2017లో పారిస్ సెయింట్-జర్మైన్ క్లబ్లో చేరిన నేమార్.. బ్రెజిల్ తరపున 103 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 63 గోల్స్ చేశాడు. పీలే అనంతరం తన దేశం తరపున అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా నేమార్ నిలిచారు. ఫోర్బ్స్ ప్రకారం, రోనాల్డో, మెస్సీ తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే ఫుట్‌బాల్ ఆటగాడిగా నేమార్ మూడో స్థానంలో నిలిచారు.
2020: ఉక్రెయిన్ కుంభకోణంలో డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియను రద్దు చేసిన అమెరికా సెనేట్
2008: ఆధ్యాత్మిక గురువు, రాక్ బ్యాండ్ ది బీటిల్స్ సభ్యుడు మహర్షి మహేశ్ యోగి మరణం
1994: సరయేవో మార్కెట్లో ఊచకోత, 68 మంది మరణం
1990: భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ జననం
1976: నటుడు అభిషేక్ బచ్చన్ జననం
1900: పనామా కెనాల్ ఒప్పందంపై సంతకాలు చేసిన అమెరికా, బ్రిటన్