ట్విట్టర్లోకి మళ్లీ ట్రంప్ వస్తారా? ఆ ప్రశ్నకు బదులిచ్చిన మస్క్
Elon Musk twitter:అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ట్విట్టర్ నిషేధం ఉన్న విషయం తెలిసిందే. 2021 క్యాపిటల్ హిల్ అటాక్ నేపథ్యంలో ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను బ్యాన్ చేశారు. అయితే ఇప్పుడు ట్విట్టర్ సంస్థను బిలియనీర్ ఎలన్ మస్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మస్క్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోం
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ట్విట్టర్ నిషేధం ఉన్న విషయం తెలిసిందే. 2021 క్యాపిటల్ హిల్ అటాక్ నేపథ్యంలో ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను బ్యాన్ చేశారు. అయితే ఇప్పుడు ట్విట్టర్ సంస్థను బిలియనీర్ ఎలన్ మస్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మస్క్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. మళ్లీ ట్రంప్‌ను ట్విట్టర్లోకి ఆహ్వానిస్తారా అని చాలా మంది మస్క్‌ను ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు తనదైన స్టయిల్లో బదులు ఇచ్చారు మస్క్.
If I had a dollar for every time someone asked me if Trump is coming back on this platform, Twitter would be minting money!
— Elon Musk (@elonmusk) October 31, 2022
ట్రంప్ గురించి ప్రశ్నలు వేసినప్పుడల్లా తనకు ఒక డాలర్ వచ్చిందంటే, అప్పుడు ట్విట్టర్‌కు భారీగా డబ్బులు వస్తున్నట్లే కదా అన్న రీతిలో మస్క్ ఓ ట్వీట్ చేశారు. అంటే ట్రంప్‌ను ఆహ్వానించేందుకు మస్క్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల 44 బిలియన్ల డాలర్లకు సోషల్ నెట్వర్క్ సైట్ ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దానికి ఇక ఆయనే సీఈవోగా ఉండనున్నారు.
ఒకవేళ ట్రంప్‌కు మళ్లీ ట్విట్టర్ ఖాతాను ఇస్తే, అప్పుడు ట్విట్టర్‌తో తెగతెంపులు చేసుకునేందుకు అమెరికాకు చెందిన టాప్ బ్రాండ్లు సిద్ధమై ఉన్నట్లు ద వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

