Threads | సంచలనాలు సృష్టిస్తున్న థ్రెడ్స్.. త్వరలోనే ట్విట్టర్ ను మింగేయబోతుందా?
ప్రముఖ మెసేజింగ్ యాప్ ట్విట్టర్‌కు పోటీగా మెటా (ఫేస్బుక్ మాతృసంస్థ) రూపొందించిన ‘థ్రెడ్స్' సంచలనాలు నమోదుచేస్తున్నది. విడుదల చేసిన ఏడు గంటల్లోనే కోటిమందికిపైగా థ్రెడ్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొన్నట్టు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ట్విట్టర్‌ను ఎలాన్‌మస్క్ కొనుగోలు చేసిన తర్వాత, రోజుకో కొత్త కండిషన్ తెస్తుండటంతో చికాకులో ఉన్న యూజర్లు.. ఇప్పుడు థ్రెడ్స్‌కు బ్రహ్మరథం పడుతున్నట్టు సమాచారం.
న్యూఢిల్లీ, జూలై 6: ప్రముఖ మెసేజింగ్ యాప్ ట్విట్టర్‌కు పోటీగా మెటా (ఫేస్బుక్ మాతృసంస్థ) రూపొందించిన ‘థ్రెడ్స్’ సంచలనాలు నమోదుచేస్తున్నది. విడుదల చేసిన ఏడు గంటల్లోనే కోటిమందికిపైగా థ్రెడ్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొన్నట్టు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ట్విట్టర్‌ను ఎలాన్‌మస్క్ కొనుగోలు చేసిన తర్వాత, రోజుకో కొత్త కండిషన్ తెస్తుండటంతో చికాకులో ఉన్న యూజర్లు.. ఇప్పుడు థ్రెడ్స్‌కు బ్రహ్మరథం పడుతున్నట్టు సమాచారం. యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో తప్ప ప్రపంచవ్యాప్తంగా థ్రెడ్స్‌ను విడుదల చేశారు. అనేకమంది సెలబ్రెటీలు థ్రెడ్స్‌ను ఉపయోగించటం మొదలుపెట్టి సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ఇందులో రాసే సందేశాలను థ్రెడ్స్ అని పిలుస్తున్నారు.
ట్విట్టర్‌ను పడగొట్టడమే లక్ష్యంగా..
ట్విట్టర్‌ను పడగొట్టడమే లక్ష్యంగా వచ్చిన థ్రెడ్స్‌ను మెటా తెలివిగా ఇన్‌స్టాగ్రామ్‌తో లింకు పెట్టింది. ఇన్‌స్టా కూడా మెటాకు చెందిన కంపెనీయే అన్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే 200 కోట్లమంది యూజర్లు ఉన్నారు. వీరంతా థ్రెడ్స్‌ను వాడటం మొదలుపెడితే కొన్నిరోజుల్లోనే ట్విట్టర్‌ను థ్రెడ్స్ అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసమే ఇన్‌స్టాతో లింకు పెట్టినట్టు భావిస్తున్నారు. థ్రెడ్స్ యూజర్ ప్రొఫైల్ ఇన్‌స్టా ప్రొఫైల్‌లో భాగంగా ఉంటుంది. థ్రెడ్స్‌లో రాసే సందేశాలను ఇన్‌స్టాలోకి పంపుకోవచ్చు. సమస్యల్లా మనకు నచ్చకపోతే థ్రెడ్స్ అకౌంట్‌ను డిలీట్ చేస్తే మాత్రం.. ఇన్‌స్టా అకౌంట్ కూడా దానంతట అదే డిలీట్ అయిపోతుంది. దీంతో ఒక్కసారి థ్రెడ్స్‌లో లాగిన్ అయిన యూజర్ ఇన్స్టాకోసమైనా సచ్చినట్టు దీనిని కొనసాగించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
500 అక్షరాలు రాసుకోవచ్చు
థ్రెడ్స్‌ను వాడుతున్న యూజర్లలో చాలామంది ఇది కూడా ట్విట్టర్‌లాగే ఉన్నదని చెప్తున్నారు. సందేశాలు రాయటం, వీడియోలు పోస్ట్ చేయటం వంటివి ట్విట్టర్‌ను తలపిస్తున్నాయని చెప్తున్నారు. ట్విట్టర్లో ఒక ట్వీట్‌కు 280 అక్షరాల పరిమితే ఉండగా, థ్రెడ్స్‌లో 500 అక్షరాల వరకు ఒక థ్రెడ్‌ను రాసుకొనేందుకు అవకాశం ఇచ్చారు. ఇందులో 5 నిమిషాల నిడివికి మించకుండా వీడియోలను కూడా పోస్ట్ చేసుకోవచ్చు. అయితే, మొదటిరోజు వీడియోలు పోస్ట్ చేయటంలో సమస్యలు ఎదుర్కొన్నట్టు కొందరు యూజర్లు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

