శాన్ఫ్రాన్సిస్కో: తన కంపెనీ మాజీ ఉద్యోగి గురించి వాస్తవాలు తెలుసుకోకుండా ట్వీట్ చేసినందుకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ క్షమాపణలు చెప్పారు. గత ఆదివారం థోర్లిఫ్సన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆయన ‘హల్లీ’ పేరుతో ట్విటర్ ఖాతా కలిగి ఉన్నారు. కండరాల లోపంతో బాధపడుతూ చక్రాల కుర్చీ వాడుతున్నారు. తన తొలగింపు వెనక్కి తీసుకోవాలని ఆయన మస్క్‌కు ట్వీట్ చేశారు.
దీనిపై చాటింగ్ చేసిన మస్క్.. థోర్లిఫ్సన్ ధనవంతుడని, పెద్ద మొత్తంలో పరిహారం పొందడానికే అందరికీ తెలిసేలా ఇలా ట్వీట్ చేశాడని ఆరోపించారు. అయితే ఆ తర్వాత థోర్లిఫ్సన్ ఆరోగ్యం గురించి తెలుసుకున్న మస్క్ అతడి పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు అతడిని క్షమాపణ కోరుతున్నానని ట్వీట్ చేశారు. మస్క్ క్షమాపణ ‘ఆశ్చర్యంగా’ ఉన్నదని థోర్లిఫ్సన్ స్పందించారు.