Donald Trump | తైవాన్ స్వాతంత్ర్యం కోసం మేం యుద్దం చేయలేం.. జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం మాటమార్చిన డొనాల్డ్ ట్రంప్
Donald Trump | తైవాన్ (Taiwan) స్వాతంత్ర్య కాంక్ష్యపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడటం తమకు కష్టమైన సమస్యేనని అన్నారు. భౌగోళికంగా తైవాన్ తమకు చాలా దూరంలో ఉందని వ్యాఖ్యానించారు. తైవాన్ ద్వీపం చైనా (China) కు కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అమెరికాకు మాత్రం 15 వేల కిలోమీటర్లకుపైగా దూరాన ఉందని చెప్పారు.
Donald Trump : తైవాన్ (Taiwan) స్వాతంత్ర్య కాంక్ష్యపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడటం తమకు కష్టమైన సమస్యేనని అన్నారు. భౌగోళికంగా తైవాన్ తమకు చాలా దూరంలో ఉందని వ్యాఖ్యానించారు. తైవాన్ ద్వీపం చైనా (China) కు కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అమెరికాకు మాత్రం 15 వేల కిలోమీటర్లకుపైగా దూరాన ఉందని చెప్పారు. ఎక్కువ దూరం కాబట్టి వేగంగా స్పందించడం కష్టమని వ్యాఖ్యానించారు. చైనా చాలా శక్తిమంతమైన పెద్ద దేశమని అన్నారు.
ఉద్రిక్తతల విషయంలో చైనా, తైవాన్లు సంయమనం పాటించాలని ట్రంప్ సూచించారు. వారి స్వాతంత్ర్య ఆకాంక్షల కోసం తాము అంతదూరం ప్రయాణించి యుద్ధం చేయాలని అనుకోవడం లేదని చెప్పారు. చైనా పర్యటన అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తైవాన్ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే అమెరికా-చైనా మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని ట్రంప్‌నకు జిన్‌పింగ్ స్పష్టంచేసినట్లు వార్తలు వచ్చాయి. అమెరికా- చైనాలు భాగస్వామ్య దేశాలుగా ఉండాలే తప్ప ప్రత్యర్థులుగా కాదని జిన్‌పింగ్ అన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ట్రంప్ మాటమార్చడం చర్చనీయాంశమైంది. కాగా తైవాన్ను తనలో పూర్తిగా విలీనం చేసుకోవాలని చైనా కోరుకుంటోంది. తైవాన్ స్వాతంత్య్రాన్ని అమెరికా బహిరంగంగా వ్యతిరేకించాలన్నది చైనా వాదన. ఈ క్రమంలో ‘తైవాన్ విషయంలో చైనా ఏకపక్ష చర్యలకు దిగరాదు’ అని ఇంతకాలం అమెరికా స్పష్టంచేస్తూ వచ్చింది. అందుకు భిన్నంగా ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నారు. తైవాన్‌కు ఆయుధాలు విక్రయించాలా, వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ చెప్పారు. ఈ వ్యాఖ్యలు కూడా ఆయన వైఖరిలో మార్పును వెల్లడిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

