Donald Trump | యుద్ధం ఆపకపోతే తీవ్ర పరిణామాలు.. పుతిన్‌కు ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధినేత పుతిన్ ఈ నెల 15న అలస్కాలో భేటీ కానున్నారు. మరికొన్ని గంటల్లో సమావేశం జరుగనుండగా పుతిన్‌ను ట్రంప్ హెచ్చరించారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధినేత పుతిన్ ఈ నెల 15న అలస్కాలో భేటీ కానున్నారు. మరికొన్ని గంటల్లో సమావేశం జరుగనుండగా పుతిన్‌ను ట్రంప్ హెచ్చరించారు. శుక్రవారం నాటి చర్చల తనంతరం ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని పుతిన్ (Vladimir Putin)ఆపకపోతే అత్యంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ (Ukraine) భూభాగం విషయంలోనే చర్చలుంటాయని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు ఇతర ఐరోపా నేతలతో వర్చువల్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం అలస్కాలో పుతిన్‌తో భేటీ సవ్యంగా సాగుతుందని భావిస్తున్నానని చెప్పారు. యుద్ధాన్ని ఆపేదిలేదని పుతిన్ చెబితే రష్యా తీవ్ర పర్వావసానాలు ఎదుర్కోక తప్పదన్నారు. రెండో దఫా ఆంక్షలు కూడా విధించాల్సి వస్తుందని తెలిపారు.
ఒకవేళ ఈ భేటీ సత్ఫలితాలిస్తే జెలెన్స్కీని (Zelensky)కూడా కలుపుకొని మరో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించారు. అది మరింత ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు. ఇరువురి భేటీలో తనను అనుమతిస్తే భాగస్వామినవుతానని చెప్పారు. కాగా, అలస్కాలో జరుగనున్న ట్రంప్, పుతిన్ భేటీ అత్యంత గోప్యంగా జరుగబోతున్నదని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. సమావేశం జరిగే గదిలో వారిద్దరితోపాటు అనువాదకులు మాత్రమే ఉంటారని పేర్కొన్నాయి. ఇంకేవరికీ ప్రవేశం ఉండబోదని తెలిపాయి. ఇరువురు నేతలు దాదాపు నాలుగేండ్ల తర్వత ముఖాముఖి చర్చలు జరుపనుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది.
మరోవైపు ట్రంప్‌తో సమావేశం అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. తమ దేశంలో శాంతిస్థాపన అంశంపై ప్రపంచ నేతలు ఏకతాటిపై ఉన్నారన్నారు. పుతిన్ బుకాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మొత్తం ఉక్రెయిన్ను ఆక్రమించగలనని చూపించేందుకు సరిహద్దుల్లో యుద్ధాన్ని విస్తరించేందుకు చూస్తున్నారని విమర్శించారు. ఒకవేళ పుతిన్ కాల్పుల విరమణకు అంగీకరించపోతే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతో యుద్ధం నిలిచిపోయే అవకాశం ఉంటుందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

