President Macron: అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవకపోవచ్చు: మాక్రన్
President Macron: అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో ఈసారి ట్రంప్ గెలవడం అసాధ్యమే అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ అనుమానాలు వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తారన్న అంశంపై మాక్రన్‌ను ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు.
పారిస్: అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో ఈసారి ట్రంప్ గెలవడం అసాధ్యమే అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్(President Macron) అనుమానాలు వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తారన్న అంశంపై మాక్రన్‌ను ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఫ్రాన్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో నాటో దళాల మోహరింపును ఆయన వ్యతిరేకించారు. రష్యా విక్టరీని అడ్డుకునేందుకు తమ దేశం ఏమైనా చేస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న దశలో రష్యాతో చర్చలు నిర్వహించలేమన్నారు. చర్చలకు తానెప్పుడూ సిద్ధమే అని, కానీ దీక్షగల, శాంతియుత వ్యక్తి కావాలన్నారు. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు రష్యా అధ్యక్షుడితో చర్చలు నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఒకవేళ అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తే ఆయన్ను శాంతి చర్చలకు వాడుకుంటారా అని మాక్రన్‌ను ప్రశ్నించారు. ఆ సమయంలో మాక్రన్ సమాధానం ఇస్తూ.. తనకు తెలిసినంత వరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలుస్తారని అనుకోవడం లేదన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఒకవేళ తాను గెలిస్తే, 24 గంటల్లోనే ఉక్రెయిన్ సమస్యను తీర్చనున్నట్లు ఇటీవల ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

