Tariff War | అమెరికాపై ఈయూ, కెనడా ప్రతీకార సుంకాలు
ఉక్కు, అల్యూమినియానికి సంబంధించిన అన్ని ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్(ఈయూ), కెనడా ప్రతీకార చర్యలు చేపట్టాయి. అమెరికాకు చెందిన 28 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై సుంకాలు విధించనున్నట్టు ఈయూ ప్రకటించింది.
- ప్రకటించిన
- ఉక్కు, అల్యూమినియంపై అమెరికా టారిఫ్‌లకు కౌంటర్
Tariff War | వాషింగ్టన్, మార్చి 12 : ఉక్కు, అల్యూమినియానికి సంబంధించిన అన్ని ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్(ఈయూ), కెనడా ప్రతీకార చర్యలు చేపట్టాయి. అమెరికాకు చెందిన 28 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై సుంకాలు విధించనున్నట్టు ఈయూ ప్రకటించింది. ఇప్పటివరకు అమెరికా వస్తువులపై ఉన్న టారిఫ్ సస్పెన్షన్‌ను ఏప్రిల్ 1 నుంచి ఎత్తివేస్తున్నట్టు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఉర్సులా వాన్‌డెర్ లెయెన్ ప్రకటించారు. అమెరికా 28 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలు విధించడానికి సిద్ధపడుతుండగా, తాము కూడా 26 బిలియన్ యూరోల (28 బిలియన్ డాలర్లు) విలువైన ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. 27 సభ్య దేశాల తరఫున వాణిజ్య వ్యాపార ఘర్షణలను చక్కదిద్దే బాధ్యతను కమిషన్ నిర్వహిస్తోంది.
తాము సంప్రదింపులకు ఎప్పుడూ సిద్ధమేనని ఆమె చెప్పారు. రాజకీయ, ఆర్థిక భౌగోళిక అస్థిర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో సుంకాల భారాన్ని తమ దేశాలు ఆర్థికంగా మోయలేవని పేర్కొన్నారు. ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులతోపాటు జౌళి, చర్మ వస్తువులు, గృహోపకరణాలు, ఇంటి పనిముట్లు, ప్లాస్టిక్, కలప వంటి వస్తువులతోపాటు పౌల్ట్రీ, బీఫ్, సీఫుడ్, నట్స్, గుడ్లు, చక్కెర, కూరగాయలు వంటి వ్యవసాయ పదార్థాల ధరలపై కూడా ప్రభావం ఉంటుందని కమిషనర్ చెప్పారు. తాను విధించే పన్నుల వల్ల అమెరికా ఫ్యాక్టరీలలో ఉపాధి కల్పన జరుగుతుందన్న ట్రంప్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ యూరపు, అమెరికాలో కూడా ఉద్యోగాలు పోవడంతోపాటు ధరల పెరుగుదల ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అమెరికా పన్నులతో వ్యాపారాలే కాక వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు.
అమెరికాపై కెనడా సుంకాలు
తమ దేశానికి చెందిన ఉక్కు, అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా కెనడా కూడా అమెరికా వస్తువులపై రూ. 20.7 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలను విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. గురువారం నుంచి అమలులోకి వచ్చే ఈ కొత్త సుంకాలు కంప్యూటర్లు, క్రీడా సామగ్రి వంటి వివిధ రకాల వస్తువులపై ఉంటాయి.
మా మద్యంపై భారత్ 150% సుంకం
అమెరికన్ మద్యం, వ్యవసాయ ఉత్పత్తులపై భారత ప్రభుత్వం భారీగా సుంకాలు విధిస్తున్నదని ట్రంప్ ప్రభుత్వం విమర్శించింది. అమెరికన్ వస్తువులపై భారతీయ సుంకాలు ప్రస్తుత వాణిజ్య పరిస్థితికి ఏమాత్రం దోహదపడబోవని వైట్ హౌస్ పత్రికా కార్యదర్శి క్యాథరిన్ లీవిట్ అన్నారు. అమెరికన్ డెయిరీ ఉత్పత్తులపై కెనడా దాదాపు 300 శాతం సుంకాన్ని విధిస్తోందని, అమెరికన్ ఆల్కహాల్(మద్యం)పై భారత్ 150 శాతం, వ్యవ సాయ ఉత్పత్తులపై 150 శాతం సుంకాన్ని విధిస్తోందని చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో భారత్‌కు అమెరికా ఉత్పత్తులు ఎలా ఎగుమతి అవుతాయని ఆమె ప్రశ్నించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

