Donald Trump | యుద్ధం ముగించే సమయం ఆసన్నమైంది.. నెతన్యాహుకు ఫోన్లో చెప్పిన డొనాల్డ్ ట్రంప్
Donald Trump | ఇరాన్ (Iran) తో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇజ్రాయెల్ ప్రధాని (Israel PM) బెంజమిన్ నెతన్యాహు (Benjamin Nethanyahu) తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
Donald Trump : ఇరాన్ (Iran) తో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇజ్రాయెల్ ప్రధాని (Israel PM) బెంజమిన్ నెతన్యాహు (Benjamin Nethanyahu) తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కేవలం మరికొన్ని రోజుల్లోనే కుదిరే అవకాశం ఉందని ఆయనకు తెలిపినట్లు యాక్సియోస్ కథనం వెల్లడించింది. ‘ఇది మంచి ఒప్పందం.. యుద్ధాన్ని ముగించే సమయం వచ్చేసింది’ అని నెతన్యాహుకు ట్రంప్ చెప్పినట్లు సమాచారం.
అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు తుదిదశకు చేరుకున్నాయని ఇరుదేశాల అధికారులు చెబుతున్నారు. గతంలో ఇరాన్లో పాలన మార్పే లక్ష్యమని వాదించిన నెతన్యాహు.. ఇప్పుడు ట్రంప్ ముందుకు తీసుకెళుతున్న ఒప్పందాన్ని అడ్డుకోలేమనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ ఆందోళనలను ఒప్పందంలో పరిగణనలోకి తీసుకుంటారని ట్రంప్‌పై తనకు నమ్మకం ఉందని ఆయన చెప్పినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే ప్రతిపాదిత ఒప్పందంపై ఇజ్రాయెల్ పూర్తిగా సంతృప్తిగా లేదని సమాచారం. ఆంక్షల సడలింపుతో ఇరాన్ చమురు విక్రయాలు పెంచుకొని ఆర్థికంగా బలపడొచ్చని, అదే సమయంలో అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయకపోవచ్చని ఇజ్రాయెల్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ దేశ రక్షణ మంత్రి కాట్జ్ మాట్లాడుతూ.. అమెరికా తన ప్రయోజనాల దృష్ట్యా ఒప్పందం కుదుర్చుకుంటున్నప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమం, క్షిపణులు, అనుబంధ తీవ్రవాద సంస్థల విషయంలో తమ భద్రతా ఆందోళనలు కాపాడాలని ఆశిస్తున్నామని చెప్పారు.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం అమెరికా-ఇరాన్ మధ్య త్వరలో ఓ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరే అవకాశం ఉంది. ఇందులో 60 రోజుల కాల్పుల విరమణ, ఇరాన్‌పై ఆంక్షల సడలింపు, అణు కార్యక్రమంపై తదుపరి చర్చలకు మార్గం సుగమం చేసే అంశాలు ఉండనున్నాయి. అలాగే హర్మూజ్ జలసంధిని తిరిగి పూర్తిగా తెరవడం, ఇరాన్ పోర్టులపై అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

