వాషింగ్టన్, సెప్టెంబర్ 22 : ఇటీవల మూడు ప్రధాన మీడియా సంస్థలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన నిషేధంపై మీడియా సంస్థలు కూడా ప్రతీకార చర్యలకు దిగాయి. సోమవారం న్యూయార్క్ లో జరిగిన ఐరాస సార్వత్రిక సభకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేయకుండా నిలిపివేశాయి.
అయితే తమకు ఈ వార్తాసంస్థలతో అవసరం లేదంటూ ట్రంప్ ఏకంగా 24 గంటల వార్తా ప్రసారాలతో ఏకంగా కొత్త టీవీని ప్రారంభించారు. తమ పాలనపై విమర్శలు చేస్తున్నారన్న ఆరోపణలతో ఇటీవల ట్రంప్ సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థలకు వైట్ హౌస్లోకి ప్రవేశాన్ని నిషేధించారు.