ట్రంప్ ఖాతాను పునరుద్ధరించిన ట్విట్టర్
Donald Trump | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ ఇచ్చారు. జీవితకాల నిషేధానికి గురైన ట్రంప్ ఖాతాను ట్విట్టర్ పునరుద్ధరించింది.
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ ఇచ్చారు. జీవితకాల నిషేధానికి గురైన ట్రంప్ ఖాతాను ట్విట్టర్ పునరుద్ధరించింది. 2021 జనవరిలో జరిగిన క్యాపిటల్ హిల్ దాడి తర్వాత ట్రంప్ అకౌంట్‌ను మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఖాతా పునరుద్ధరణపై కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ నిర్వహించిన ఓటింగ్‌లో 51.8 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఓటువేశారు. దీంతో మాజీ అధ్యక్షుడి ఖాతాను పునరుద్ధరిస్తున్నామని మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో 22 నెలల తర్వాత ట్రంప్ ఎకౌంట్ ట్విట్టర్లో మళ్లీ ప్రత్యక్షమైంది.
The people have spoken.
Trump will be reinstated.
Vox Populi, Vox Dei. https://t.co/jmkhFuyfkv
— Elon Musk (@elonmusk) November 20, 2022
ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడారు.. ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తున్నామని మస్క్ ట్వీట్ చేశారు. ‘ప్రజల స్వరం, దేవుని స్వరం’ (వోక్స్ పాపులి, వోక్స్ డీ) అంటూ ల్యాటిన్ పదబంధాన్ని ఉపయోగించారు. డోనాల్డ్ ట్రంప్‌కు తిరిగి ట్విట్టర్ ఖాతాను ఇద్దామా వద్దా అని ఎలాన్ మస్క్ పోల్ నిర్వహించారు. ఎస్ ఆర్ నో చెప్పాలంటూ శనివారం ఆయన ఓ ట్వీట్ చేశారు. 24 గంటలపాటు కొనసాగిన ఈ పోల్‌లో కోటీ 50 లక్షల 85వేల 458 మంది పాల్గొన్నారు. అందులో 51.8 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా, 48.2 శాతం మంది వ్యతిరేకంగా స్పంధించారు. దీంతో 22 నెలల నిషేధం తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతాను సంస్థ పునరుద్ధరించింది.
Reinstate former President Trump
— Elon Musk (@elonmusk) November 19, 2022

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

