Tricolor insulted | త్రివర్ణ పతాకానికి కెనడాలో అవమానం.. కిందేసి తొక్కిన ఖలిస్తానీ మద్దతుదారులు
Tricolor insulted | కెనడాలోని ఖలిస్తానీ మద్దతుదారులు భారత జాతీయ జెండాకు తీరని అవమానం తలపెట్టారు. భారతీయుడి చేతిలో నుంచి త్రివర్ణ పతాకాన్ని లాక్కొని మరీ కిందేసి తొక్కారు. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Tricolor insulted | కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. భారత జాతీయజెండాను ఘోరంగా అవమానించారు. ఈ సందర్భంగా ఖలిస్తానీ అనుకూల, భారత్ వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. బందీ చోర్ దివాస్ సందర్భంగా కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఖలిస్తానీ మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు. ఖలిస్తానీ పతాకాన్ని పైకి ఎగురవేస్తూ.. భారత త్రివర్ణపతాకాన్ని కింద పడేసి తొక్కుతూ ఆనందించారు. కారులో త్రివర్ణ పతాకంతో వెళ్తున్న వ్యక్తి చేతుల్లోంచి లాక్కొని మరీ అవమానించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
ఖలిస్తానీ తీవ్రవాద సంస్థను భారతదేశం చాలా సంవత్సరాల క్రితం బ్లాక్‌లిస్టులో పెట్టింది. వీరి మద్దతుదారులు కెనడాలోని బ్రాంప్టన్ నగరానికి పెద్ద సంఖ్యలో చేరి క్యాప్టివ్ చోర్ డే జరిపారు. చేతుల్లో ఖలిస్తానీ జెండాలను ఊపుతూ ఖలిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ విషయం సమీపంలో నివసించే భారతీయులకు తెలియడంతో వారు కూడా తమ వాహనాల్లో త్రివర్ణ పతాకాలను చేతబూని ర్యాలీ చేపట్టారు. దాంతో బ్రాంప్టన్ నగరంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది.
కారులోని ఓ భారతీయుడి చేతిలో నుంచి తిరంగా జెండాను లాక్కున్న కొందరు ఖలిస్తానీ మద్దతుదారులు.. దాన్ని కిందపడేసి తొక్కారు. ఖలిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ అదే సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా నినదించారు. వీరికి పోటీగా అక్కడికి చేరిన భారతీయులు హిందుస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఖలిస్తానీ మద్దతుదారుల చర్యపై కెనడాలో నివసిస్తున్న భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ ఘటనపై అక్కడి భారతీయులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

