Tim Cook | ఆపిల్ సీఈవో టిమ్ కుక్ పేరిట ఫేక్ ఇన్‌స్టా అకౌంట్..! తొలగించిన మెటా కంపెనీ..!
Tim Cook | ఇటీవల సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది. సినిమా తారలు, పారిశ్రామికవేత్తలు సైతం సోషల్ మీడియాలో తాలుంటున్నాయి. దీంతో వీటి ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వస్తున్నారు. అయితే, తడువుగా కొందరు పలువురు ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలను తెరుస్తున్నారు.
Tim Cook | ఇటీవల సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది. సినిమా తారలు, పారిశ్రామికవేత్తలు సైతం సోషల్ మీడియాలో తాలుంటున్నాయి. దీంతో వీటి ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వస్తున్నారు. అయితే, తడువుగా కొందరు పలువురు ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలను తెరుస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖల పేరిట గుర్తు తెలియని వ్యక్తులు తెరిచిన దాఖలున్నాయి. తాజాగా ఆపిల్ సీఈవో పేరుతో అకౌంట్‌ను తెరిచారు. అయితే, టిమ్ కుక్ పేరిట ఉన్న ఫేక్ అకౌంట్‌ను మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ తొలగించింది.
టిమ్ కుక్ నకిలీ ఖాతాను 9to5Mac గుర్తించింది. అయితే, ఈ ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సైతం ఫాలో అవుతుండడం విశేషం. వాస్తవానికి ఆపిల్ సీఈవోకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి వ్యక్తితగత అకౌంట్ లేదు. ప్రస్తుతం ఉన్న ఇన్‌స్టా ఫేక్ అకౌంట్ ఆయన ఒరిజినల్ ఖాతా మాదిరిగానే కనిపిస్తుంది. ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసిన నుంచి ఇప్పటికు కేవలం రెండు పోస్టులు మాత్రమే పెట్టారు. ఒకటి ఆగస్టు 20న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవానికి సంబంధించింది కాగా.. మరొకటి ఆపిల్ ఉత్పత్తుల ప్రకటనలకు సంబంధించింది. ఈ ప్రకటనలు టీమ్‌కుక్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి కాపీ చేసినట్లు గుర్తించారు. ఇక టిమ్‌కుక్ ఫేక్ నకిలీ ఇన్‌స్టా అకౌంట్‌ను ఫాలో అవుతున్న వారిలో కంపెనీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ ((Apple Vice President for Environment, Policy and Social Initiatives), హ్యూమన్ ఇంటర్ఫేస్ డిజైనర్ అలాన్ డైతో పాటు పలువురు సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ సైతం ఉన్నారు.
ఇదిలా ఉండగా.. ఆపిల్ చీఫ్ సోషల్ మీడియాలో చాలా అరుదుగా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ఇప్పటి వరకు ఇన్స్టాలోగానీ టిక్టాక్లోగానీ అధికారిక ఖాతా లేదు. ట్విట్టర్లో మాత్రమే అధికారిక ఖాతా ఉన్నది. 2021 ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టిమ్ కుక్ సోషల్ మీడియా వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మైండ్‌లెస్ స్క్రోలింగ్’ అని, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని, ఇది మన మానసిక ఆరోగ్యానికి, మీ చుట్టూ ఉన్న వారికి సైతం మంచిదికాదని తాను భావిస్తున్నానన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

