కీవ్ దిశగా 3 మైళ్ల పొడువైన రష్యా సైనిక కాన్వాయ్.. శాటిలైట్ పిక్స్
కీవ్: ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా.. భారీ ఆయుధాలతో ముందుకు వెళ్తోంది. కీవ్ నగరాన్ని చేజిక్కించుకునేందుకు రష్యన్ సైనిక దళం ఆ దిశగా దూసుకెళ్తోంది. సుమారు మూడు మైళ్ల పొడుగు ఉన్న రష్యా సైనిక కాన్వాయ్ కీవ్ రూట్లో వెళ్తున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించారు. ఇప్పటికే కీవ్ నగరంలో రష్యా, ఉక్రెయిన్ దళాల మధ్య భీకర పోరు నడుస్తోంది. రాజధాని కీవ్ మార్గంలో ఉన్న ఓ హైవేపై .. రష్యా సైనిక కాన్వాయ్ మూడు మైళ్ల పొడుగు ఉన్నట్లు మాక్సర్ ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.56 నిమిషాలకు ఈ చిత్రాలను తీశారు. ఇవాన్వీక్ వద్ద ఉన్న P-02-02 రోడ్డుపై సైనిక కాన్వాయ్ వెళ్తున్నట్లు గుర్తించారు. రాజధాని కీవ్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో బలగాలు ఉన్నట్లు తెలిపారు. P-02-02 రోడ్డు మార్గం కీవ్‌కు వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంధనం, లాజిస్టిక్స్ ట్రక్కులతో సైన్యం కీవ్ దిశగా వెళ్తున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించారు. ఆ కాన్వాయ్‌లో యుద్ధ ట్యాంక్‌లు, ఇన్ఫాంట్రీ వాహనాలు, ఆర్టిల్లరీ దళాలు ఉన్నట్లు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

