Russia: నవాల్నీ తరపున వాదించిన ముగ్గురు లాయర్లకు జైలుశిక్ష విధించిన రష్యా కోర్టు
Russian court: అలెక్సీ నవాల్నీ తరపున గతంలో వాదించిన ముగ్గురు రష్యా లాయర్లకు ఆ దేశ కోర్టు జైలుశిక్షను ఖరారు చేసింది. వాదిమ్ కోబ్జెవ్, ఇగర్ సెర్గునిన్, అలెక్సీ లిప్స్టర్కు.. మూడున్నర నుంచి అయిదేళ్ల పాటు శిక్షను ఫిక్స్ చేశారు.
పెటుష్కి: రష్యా(Russia) దివంగత ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ తరపున గతంలో వాదించిన ముగ్గురు లాయర్లకు ఆ దేశ కోర్టు జైలుశిక్షను ఖరారు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్న వారిపై పుతిన్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా గతంలో నవాల్నీకి వాదించిన ముగ్గురు లాయర్లను జైళ్లో వేశారు. వాదిమ్ కోబ్జెవ్, ఇగర్ సెర్గునిన్, అలెక్సీ లిప్స్టర్కు.. మూడున్నర నుంచి అయిదేళ్ల పాటు శిక్షను ఖరారు చేశారు. మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెటుషికి పట్టణ కోర్టు ఈ శిక్షను వేసింది. తీవ్రవాద గ్రూపులతో కలిసి పనిచేస్తున్నారన్న ఆరోపణలపై 2023 అక్టోబర్‌లో ఆ ముగ్గుర్నీ అరెస్టు చేశారు. నవాల్నీ నెట్‌వర్క్‌లతో కలిసి ఆ లాయర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 19 ఏళ్ల జైలుశిక్ష పడ్డ అలెక్సీ నవాల్నీ.. 2023 ఫిబ్రవరిలో ఓ జైలులో మరణించాడు. నవాల్నీకి చెందిన సంస్థలన్నీ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు 2021లో ప్రభుత్వం పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

