బ్యాంకాక్ : థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఓ లగ్జరీ మాల్లో జరిగిన కాల్పుల ఘటనలో (Shooting At Mall) ముగ్గురు మరణించగా, మరో అయిదుగురు గాయపడ్డారు. సియం పరగాన్ ప్రాంతంలో కాల్పులు జరగ్గా 14 ఏండ్ల గన్‌మ్యాన్ అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పుల ఘటనతో మాల్లో ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.
షాపింగ్ మాల్ డోర్స్‌ను తోసుకుంటూ చిన్నారులు, మహిళలు బయటకు పరుగుతీశారు. మాల్ బాత్రూం నుంచి కా్లపుల శబ్ధాలు వినిపించాయని స్ధానిక టీవీ చానెల్ 3 పేర్కొంది. ఈ ఘటనపై ప్రధాని స్రెతా ధవిసిన్ విచారం వ్యక్తం చేశారు.
కాల్పుల ఉదంతంపై దర్యాప్తునకు ఆదేశించానని, ప్రజల భద్రతపై ఆందోళన చెందుతున్నానని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇక బ్యాంకాక్ షాపింగ్ మాల్లో కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెలుగుచూడాల్సి ఉంది.
Read More :
Nitin Gadkari | హైడ్రోజన్ బస్సులో టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లిన నితిన్ గడ్కరీ.. వీడియో