వైరల్ పోస్ట్ : ఆకట్టుకుంటున్న 16వ శతాబ్ధపు ఎంగేజ్మెంట్ రింగ్..!
యావత్ ప్రపంచం తనలో పొదిగిన జర్మనీకి చెందిన 16వ శతాబ్ధపు ఎంగేజ్మెంట్ రింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
న్యూయార్క్ : ఎంగేజ్మెంట్ రింగ్స్ జంటలకు ఎప్పటికీ ప్రత్యేకమే. సెలబ్రిటీలు ధరించే రింగ్స్ స్టైల్‌ను ఆయా జంటలు అనుకరించడం సహజంగా చూస్తుంటాం. ఎంగేజ్మెంట్ రింగ్స్‌లో డైమండ్ ఉండితీరాలనే విశ్వాసం కూడా చాలా మందిలో పాతుకుపోయింది. ప్రిన్సెస్ కట్స్, ఓవల్ కట్స్, కుషన్ కట్స్ అంటూ పలు ఆప్షన్స్ ముందుకొస్తాయి.
ఇక యావత్ ప్రపంచం తనలో పొదిగిన జర్మనీకి చెందిన 16వ శతాబ్ధపు ఎంగేజ్మెంట్ రింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మినీ ఆస్ట్రనామికల్ మ్యాప్ డిజైన్‌తో కనిపించిన ఈ రింగ్‌కు సంబంధించిన పోస్ట్ ట్విట్టర్లో వైరల్ అవుతోంది. తాను అమితంగా ప్రేమించే వ్యక్తి చేతిలో యావత్ ప్రపంచం ఇమిడిఉందనేలా ఈ రింగ్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్ట్‌కు 1.52 లక్షలకు పైగా లైక్స్‌తో పాటు పెద్దసంఖ్యలో రియాక్షన్స్ వచ్చాయి.
ఖరీదైన సాలిటైర్స్ కంటే ఇది ఎంతో అర్ధవంతంగా, మెరుగ్గా ఉందని ఈ రింగ్‌పై నెటిజన్లు మనసు పారేసుకున్నారు. ఈ రింగ్ ప్రేమకు సరైన సంకేతమని పలువురు నెటిజన్లు కితాబిచ్చారు. ఈ రింగ్ చూసిన మరుక్షణమే తాను యస్ చెబుతానని ఓ ట్విట్టర్ యూజర్ రాసుకొచ్చారు. అయితే ఇలాంటి రింగ్స్ ఇప్పటికీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని మరికొందరు యూజర్లు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
Trivikram | ప్రభాస్‌లో ఆ యాంగిల్‌ను ఎవరూ చూపించలేదు.. త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

