Dark Energy | అనంత విశ్వంలో అదృశ్య శక్తి..
అనంత విశ్వంలో ఎన్నో పాలపుంతలు.. అందులో కోటానుకోట్ల నక్షత్రాలు. ఎంత దూరం ప్రయాణిస్తూ ఉంటే అంత దూరం విశ్వమే. మరి ఈ విశ్వం ఎంతవరకు ఉన్నది? ఏ స్థాయిలో విస్తరిస్తున్నది? అసలు విశ్వం ఎలా ఏర్పడింది? అన్న ప్రశ్నలకు తలపండిన ఖగోళ శాస్త్రవేత్తలు కూడా సమాధానం కనుగొనలేకపోయారు.
Dark Energy | సిడ్నీ: అనంత విశ్వంలో ఎన్నో పాలపుంతలు.. అందులో కోటానుకోట్ల నక్షత్రాలు. ఎంత దూరం ప్రయాణిస్తూ ఉంటే అంత దూరం విశ్వమే. మరి ఈ విశ్వం ఎంతవరకు ఉన్నది? ఏ స్థాయిలో విస్తరిస్తున్నది? అసలు విశ్వం ఎలా ఏర్పడింది? అన్న ప్రశ్నలకు తలపండిన ఖగోళ శాస్త్రవేత్తలు కూడా సమాధానం కనుగొనలేకపోయారు. ఇప్పటి వరకు విశ్వంలో మన కంటికి కనిపించేదంతా 5 శాతం అని, 25 శాతం కృష్ణపదార్థమని శాస్త్రవేత్తలు భావిస్తూ వస్తున్నారు. మిగతా 70 శాతం డార్క్ ఎనర్జీ (అదృశ్య శక్తి) వాటానేనని అంచనా వేస్తూ వచ్చారు.
ఈ డార్క్ ఎనర్జీ వల్లే విశ్వం విస్తరిస్తున్నదని చెప్తున్నారు. అయితే, డార్క్ ఎనర్జీకి సంబంధించి కచ్చితమైన లక్షణాలేవీ ఎవరికీ తెలియదు. కానీ, ఆ దిశగా ఆస్ట్రేలియాకు చెందిన ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ఖగోళ శాస్త్రవేత్తలు, కాస్మాలజిస్టులు పరిశోధనలు చేసి తొలిసారి డార్క్ ఎనర్జీ లక్షణాలను గుర్తించగలిగారు. విశ్వ వ్యాప్తిలో నక్షత్రాల పాత్ర ఎంతో కీలకమని, ఆ నక్షత్రాలు పేలిపోయే సందర్భాలు మరింత వ్యాప్తికి కారణమవుతున్నాయని వెల్లడించారు. ఆ నక్షత్రాలే ఇప్పుడు డార్క్ ఎనర్జీ లక్షణాలను తెలియజేస్తున్నాయని వివరించారు. మనం ఊహించినదానికన్నా డార్క్ ఎనర్జీ అత్యంత సంక్లిష్టమైనదని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

