ఒమన్ తీరంలో ఓడ బోల్తా.. 13 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు
ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్లతో ప్రయాణిస్తున్న ప్రెస్టీజ్ ఫాల్కన్ అనే ఓడ సోమవారం బోల్తా పడింది. ఈ ఓడలో ఉన్న 16 మంది సిబ్బంది గల్లంతయ్యారని ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్(ఎంఎస్సీ) తెలిపింది.
మస్కట్, జూలై 16: ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్లతో ప్రయాణిస్తున్న ప్రెస్టీజ్ ఫాల్కన్ అనే ఓడ సోమవారం బోల్తా పడింది. ఈ ఓడలో ఉన్న 16 మంది సిబ్బంది గల్లంతయ్యారని ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్(ఎంఎస్సీ) తెలిపింది. ఇందులో 13 మంది భారతీయులు కాగా, మరో ముగ్గురు శ్రీలంకకు చెందిన వారుగా గుర్తించారు. వీరి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది.
కొమొరోస్కు చెందిన ఈ ఓడ యెమన్లోని ఓడరేవు నగరమైన ఏడెన్‌కు వెళ్తున్నట్టు తెలిసింది. రాయ్ మద్రకహ్కు ఆగ్నేయం వైపు 25 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఓడ బోల్తా పడటానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఓడ ఆచూకీ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
మస్కట్‌లో మసీదు వద్ద కాల్పులు.. భారతీయుడు మృతి
మసీదు లక్ష్యంగా ఒమన్ రాజధాని మస్కట్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు భారతీయుడు, నలుగురు పాకిస్థానీయులు ఉన్నారు. కాల్పులకు పాల్పడ్డ వారిలో ముగ్గురు దుండగులను కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. వాడీ కబీర్ ప్రాం తంలోని ఇమామ్ అలీ మసీద్ బయట సోమవారం రాత్రి స్థానికులు మతపరమైన వేడుక జరుపుకుంటుండగా ఈ కాల్పులు జరిగాయి. మృతి చెందిన భారతీయుని కుటుంబానికి సహాయ సహకారాలను అందించనున్నట్టు భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

