World’s Oldest Dog | ఇది ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకం.. గిన్నిస్ రికార్డుల్లో చోటు.. వయసెంతో తెలుసా..?
World's Oldest Dog | శునకాలు సాధారణంగా 15 నుంచి 20 ఏళ్లు బతుకుతాయి. అత్యంత అరుదుగా కొన్ని శునకాలు 25 ఏళ్లు కూడా జీవిస్తాయి. ఇక అంతకంటే రెండుమూడేళ్లు ఎక్కువ కాలం ఏ శునకమైనా జీవించిందంటే అది అద్భుతమనే చెప్పాలి.
హైదరాబాద్: శునకాలు సాధారణంగా 15 నుంచి 20 ఏళ్లు బతుకుతాయి. అత్యంత అరుదుగా కొన్ని శునకాలు 25 ఏళ్లు కూడా జీవిస్తాయి. ఇక అంతకంటే రెండుమూడేళ్లు ఎక్కువ కాలం ఏ శునకమైనా జీవించిందంటే అది అద్భుతమనే చెప్పాలి. కానీ పోర్చుగీస్‌లో ఓ శునకం మాత్రం 20 ఏళ్లు, 25 ఏళ్లు బతకడం కాదు.. ఏకంగా 30 లలో అడుగుపెట్టింది. ఇటీవలే తన 31వ పుట్టినరోజు జరుపుకుని గిన్నిస్ రికార్డుల్లో చోటుదక్కించుకుంది.
ఈ కురువృద్ధ శునకం పేరు బోబీ. పోర్చుగీస్‌లోని రఫైరో డో అలెంటెజో జాతికి చెందిన మగ శునకం ఇది. పోర్చుగీస్‌లోని కాంక్వైరస్ గ్రామానికి చెందిన లియోనల్ కోస్టా అనే మహిళ ఈ శునకాన్ని పెంచుతున్నది. కోస్టాకు 8 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు 1992 మే 13న ఆమె పేరెంట్స్ ఈ శునకాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం లియోనల్ కోస్టాకు 38 ఏళ్లు. గత శనివారం 30 ఏళ్లు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలో అడుగుపెట్టిన శునకం బోబీ బర్త్ డేను కోస్టా ఘనంగా నిర్వహించింది.
లియోనల్ కోస్టా దాదాపు 100 మంది ఇరుగుపొరుగును పిలిపించి, వారికి మటన్, చికెన్, చేపలతో భోజనాలు పెట్టించి మరీ తన శునకం బోబీకి పుట్టినరోజు వేడుకలు జరిపించింది. ఈ సందర్భంగా బోబీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కోస్టా వెల్లడించింది. తన ఇంటిచుట్టూ అటవీ ప్రాంతం ఉండటంతో బోబీని ఎన్నడూ గొలుసుపెట్టి కట్టేయలేదని చెప్పింది.
బోబీ ఫారెస్ట్ ఏరియాలో తిరిగొచ్చి ఇంటి ఆవరణలో పడుకునేదని లియోనల్ కోస్టా తెలిపారు. బోబీకి ప్రత్యేకంగా శునకాలకు ఇచ్చే ఫుడ్ ఇవ్వలేదని, మనుషులు తినే ఆహారమే తినేదని చెప్పారు. ప్రస్తుతం బోబీకి వయసు మీద పడటంతో ఎక్కువగా తిరగలేకపోతున్నదని, ఎక్కువగా ఇంటిపట్టునే ఉంటున్నదని కోస్టా అన్నారు. బోబీకి కంటి చూపు కూడా మందగించిందని తెలిపారు. అయితే తన గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ లాగే బోబీ కూడా త్వరలోనే తనకు జ్ఞాపకంగా మిగిలిపోతుందన్న ఊహ చాలా బాధకరంగా ఉందని కోస్టా ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

