Home
International
The Assassination Attempt On The Former Us President Trump During The Election Campaign Caused A Sensation
US President | అబ్రహం లింకన్ నుంచి కెనడీ దాకా.. హత్యకు గురైన నలుగురు అమెరికా అధ్యక్షులు!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన హత్యాయత్నం సంచలనం రేపింది.
US President | వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన హత్యాయత్నం సంచలనం రేపింది. ఇంతకు ముందు కూడా అమెరికాలో అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ప్రధాన పార్టీల అభ్యర్థులే లక్ష్యంగా పలుమార్లు హింసాత్మక దాడులు జరిగాయి. దాడుల కారణంగా ఏకంగా నలుగురు అధ్యక్షులు మరణించగా.. హత్యాయత్నాలతో పలువురు గాయపడ్డారు.
- 81865: హత్యకు గురైన అమెరికా మొదటి అధ్యక్షుడు అబ్రహం లింకన్. 1865, ఏప్రిల్ 14న ఆయన తన భార్యతో కలిసి వాషింగ్టన్‌లోని ఫోర్డ్స్ థియేటర్లో ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన సమయంలో జాన్ వైక్స్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. తలలో బలమైన గాయంతో లింకన్ తర్వాతి రోజున మరణించారు. నల్లజాతీయుల హక్కుల కోసం మద్దతు తెలపడమే ఆయన హత్య వెనుక కారణమని దర్యాప్తులో తేలింది.
- 81881: అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే అధ్యక్షుడు జేమ్స్ గార్ఫీల్డ్ హత్యకు గురయ్యారు. 1881, జూలై 2న న్యూ ఇంగ్లండ్‌లోని ఓ రైల్వే స్టేషన్లో ఆయనపై చార్లెస్ గిటౌ అనే వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. తర్వాత కొద్ది వారాలకు గార్ఫీల్డ్ మరణించారు.
- 81901: సెప్టెంబర్ 6న న్యూయార్క్‌లోని బఫెలో నగరంలో ప్రసంగించిన తర్వాత అధ్యక్షుడు విలియం మెకెన్లీపై కాల్పుల ఘటన చోటుచేసుకొన్నది. ప్రజలకు షేక్‌హ్యాండ్ ఇస్తున్న క్రమంలో పాయింట్ బ్లాంక్ రేంజ్లో మెకెన్లీ ఛాతిపై లియోన్ అనే 28 ఏండ్ల నిరుద్యోగి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. మెకెన్లీ వారం తర్వాత మరణించారు.
- 81963: డల్లాస్ పర్యటన సందర్భంగా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. దుండగుడి కాల్పుల్లో తీవ్ర గాయాలైన కెనడీని పార్క్‌ల్యాండ్ దవాఖానకు తరలించారు. ఆ తర్వాత ఆయన మరణించారు.
పలువురు నేతలపై కాల్పుల ఘటనలు
1933లో ఫ్రాంక్లిన్ రూస్వెల్ట్పై(32వ అధ్యక్షుడు), 1950లో హర్రీ ఎస్ తుర్మాన్ (33వ అధ్యక్షుడు), 1975లో జెరాల్డ్ ఫోర్డ్‌పై (38వ అధ్యక్షుడు), 1981లో రొనాల్డ్ రీగన్(40వ అధ్యక్షుడు), 2005లో జార్జి డబ్ల్యూ బుష్(43వ అధ్యక్షుడు)పై హత్యాయత్నాలు జరిగాయి. పలువురు అధ్యక్ష అభ్యర్థులపై కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

