బ్యాంగ్‌కాక్: థాయ్‌ల్యాండ్ క్వీన్ సుతిదా .. ఒంటరిగా గ్రిపెన్ యుద్ధ విమానంలో విహరించారు. తన ఏవియేషన్ కెరీర్లో ఆమె కొత్త మైలురాయి అందుకున్నారు. దక్షిణ థాయ్‌ల్యాండ్‌లోని సురత్ థాయి ప్రావిన్సులో ఉన్న వింగ్ 7 ఎయిర్‌బేస్ నుంచి ఆమె యుద్ధ విమానాన్ని టేకాఫ్ చేశారు. అక్టోబర్ 8వ తేదీన విహరించినట్లు స్థానిక మీడియా తెలిపింది. సింగిల్ సీటు జేఏఎస్ 39 సీ గ్రిపిన్ విమానాన్ని తొలిసారి ఒంటరిగా క్వీన్ సుతిదా నడిపారు. థాయ్ చక్రవర్తి మహా వజిరలంకోర్న్ ఈ ఘటన వేళ అక్కడే ఉన్నారు. యుద్ధ విమానంలో విహరించిన క్వీన్‌కు బోకేను అందజేశారు. క్వీన్ సుతిదాకు విమానాలు నడిపిన అనుభవం చాలా ఉన్నది. వివిధ రకాల విమానాలను ఆమె సుమారు 1188 గంటల పాటు నడిపారు. సెస్నా, పిలాటస్, పైపర్ ఎయిర్‌క్రాఫ్ట్, బోయింగ్ 737 లాంటి జెట్ విమానాలను ఆమె నడిపారు. తొలిసారి 2010, మే 13వ తేదీ ఆమె పైలట్ అవతారం ఎత్తారు. గతంలో సెస్నా టీ-41డీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను, గ్రిపెన్ జేఏఎస్ 39డీ టూ సీటర్ విమానాన్ని నడిపారు. కింగ్ దేశ, విదేశీ టూర్ల సమయంలో క్వీన్ కోపైలట్‌గా చేశార