జలాలాబాద్‌లో తాలిబన్, ఐఎస్కేపీ మధ్య ఫైట్.. బాంబు పేలుడులో ఒకరు మృతి

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌కు 90 మైళ్ల దూరంలోని నంగర్హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్‌పై పట్టు కోసం తాలిబన్, ఐఎస్కేపీ మధ్య ఫైట్ జరుగుతున్నది. తాజాగా శనివారం జరిగిన బాంబు పేలుడులో ఒక వ్యక్తి మరణించగా ఏడుగురు గాయపడ్డారు. కాగా, చనిపోయిన వ్యక్తి తాలిబన్ సభ్యుడని స్థానిక మీడియా తెలిపింది. తాలిబన్ కాన్వాయ్ వెళ్తుండగా రోడ్డు పక్కన అమర్చిన మందుపాతరను పేల్చారు. అయితే ఇది తమ పనేనని ఎవరూ వెల్లడించలేదు. కాగా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్రవాద సంస్థ ఐఎస్కేపీ పనిగా అనుమానిస్తున్నారు.
తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌పై తన పట్టును నిలుపుకునేందుకు ఐఎస్కేపీ ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లు, కాల్పులకు పాల్పడుతున్నది. గురువారం ఐఎస్‌కేపీకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఒకరు కారుపై జరిపిన కాల్పుల్లో నలుగురు తాలిబన్లు చనిపోయారు. మరణించిన వారి చేతులు కట్టేసి ఉండటాన్ని స్థానికులు గమనించారు.
మరోవైపు బుధవారం జలాలాబాద్‌లో జరిగిన పేలుడులో ఇద్దరు తాలిబన్లతో సహా ఐదుగురు మరణించారు. దీనికి ముందు జరిగిన బాంబు పేలుళ్లలో ఇద్దరు తాలిబన్లతో సహా ముగ్గురు మరణించగా 19 మంది గాయపడ్డారు. జలాలాబాద్‌లో వరుస బాంబు దాడుల నేపథ్యంలో తాలిబన్లు మరింత జాగ్రత్తగా ఉంటున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

