Kabul Bombing: అమెరికా సైనికుల కన్నా తాలిబన్లే ఎక్కువ మంది మృతి..

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ( Bomb Attacks ) లో 28 మంది తాలిబన్లు మృతిచెందినట్లు ఆ సంస్థ ప్రకటించుకున్నది. బాంబు పేలుళ్ల వల్ల అమెరికన్ల కన్నా ఎక్కువ సంఖ్యలో తమవారిని కోల్పోయినట్లు తాలిబన్లు తెలిపారు. అయితే ఎయిర్‌పోర్ట్‌పై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా తన ఆగస్టు 31వ డెడ్‌లైన్‌ను పొడించాల్సిన అవసరం లేదని కూడా ఓ తాలిబన్ అధికారి తెలిపారు. కాబూల్‌లో జరిగిన పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య 90కి చేరుకున్నది. దాంట్లో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. పేలుళ్లకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్ర సంస్థ ప్రకటించింది. పేలుళ్ల వల్ల సుమారు 150 మంది గాయపడ్డినట్లు తెలుస్తోంది.
ఎయిర్పోర్ట్ వద్ద దాడుల తర్వాత.. చాలా వరకు దేశాలు పౌరుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేశాయి. ఆగస్టు 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు లక్ష మందిని తరలించినట్లు అమెరికా చెప్పింది. గత 12 గంటల్లో ఏడు వేల మందిని తరలించినట్లు బైడెన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

