Mullah Abdul Ghani Baradar: కాబూల్‌లో అడుగుపెట్టిన తాలిబన్ అగ్రనేత బరాదార్

కాబూల్: తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదార్ ( Mullah Abdul Ghani Baradar ) శనివారం కాబూల్ చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆయన కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. జిహాదీ నేతలు, రాజకీయవేత్తలతో బరాదార్ ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. గత ఆదివారం తాలిబన్లు కాబూల్‌ను వశపరుచుకున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల రాజ్యంగా మారింది. అయితే ప్రభుత్వ ఏర్పాటు అక్కడ కీలకంకానున్నది.
తాలిబన్ నేత బరాదార్‌ను 2010లో పాకిస్థాన్‌లో అరెస్టు చేశారు. అమెరికా వత్తిడి వల్ల ఆయన్ను 2018 వరకు కస్టడీలో ఉంచారు. ఆ తర్వాత ఆయన్ను ఖతార్‌కు తరలించారు. దోహాలో ఉన్న తాలిబన్ పొలిటికల్ ఆఫీసుకు అధిపతిగా అతన్ని నియమించారు. ఆఫ్ఘన్ నుంచి అమెరికన్ దళాలు వెనక్కి వెళ్లడానికి కీలకమైన సమావేశాలను ఆయనే నిర్వహించారు. దోహాలో జరిగిన శాంతి ఒప్పందాల్లో పాల్గొన్నారు. నిజానికి ఖతార్ నుంచి మూడు రోజుల క్రితమే బరాదార్ తాలిబన్లకు కేంద్రమైన కాందహార్ చేరుకున్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

