ఆఫ్ఘన్ జూనియర్ వాలీబాల్ క్రీడాకారిణి తల నరికిన తాలిబన్లు

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్ల దురాగతాలు క్రమంగా బయటపడుతున్నాయి. ఆ దేశ జాతీయ జూనియర్ వాలీబాల్ క్రీడాకారిణి మహజాబిన్ హకిమి తల నరికి ఆమెను దారుణంగా చంపినట్లు ఆ టీమ్ కోచ్ అఫ్జాలీ తెలిపారు. తాలిబన్ మిలిటెంట్లు ఈ నెలలో ఈ దారుణానికి పాల్పడ్డారని పర్షియన్ ఇండిపెండెంట్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన చెప్పారు. దీని గురించి బయటకు చెప్పవద్దని ఆమె కుటుంబాన్ని తాలిబన్లు బెదిరించారని, దీంతో ఈ విషయం బయటకు రాలేదని అన్నారు.
ఆగస్ట్‌లో కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత జాతీయ వాలీబాల్ టీమ్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు మాత్రమే దేశం విడిచి వెళ్లగలిగారని అఫ్జాలీ చెప్పారు. దేశంలోనే ఉండిపోయిన మిగతా దురదృష్టవంతులైన క్రీడాకారుల్లో మహజాబిన్ హకిమి ఒకరని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం తాలిబన్ ఫైటర్లు మహిళా అథ్లెట్స్ కోసం గాలించి వేటాడారని, దేశ విదేశాల్లో ఆడి ప్రతిభ చూపిన ఆఫ్ఘన్ మహిళా వాలీబాల్ టీమ్ సభ్యులపైనా వారి కన్నుపడిందని అఫ్జాలీ తెలిపారు. వాలీబాల్ జట్టుతోపాటు మహిళా అథ్లెట్లు గడ్డు పరిస్థితిలో ఉన్నారని, నిరాశతో భయాందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు. కొందరు భయంతో దేశం విడిచిపోగా మరికొందరు అజ్ఞాతంలో ఉన్నారంటూ వారి దుస్థితిని వివరించారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పతనానికి ముందు కాబూల్ మున్సిపల్ వాలీబాల్ క్లబ్ తరుఫున ఆడిన స్టార్ క్రీడాకారిణుల్లో మహజాబిన్ హకిమి ఒకరు. కొన్ని రోజుల కిందట తెగిన ఆమె తల, నెత్తురోడిన మెడ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫిఫా, ఖతార్ ప్రభుత్వం గత వారం ఆఫ్ఘన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో సహా 100 మంది మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులను ఆ దేశం నుంచి తరలించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

