Afghanistan | మహిళలు యూనివర్సిటీల్లో చదవడంపై తాలిబన్ల నిషేధం
Afghanistan | అఫ్ఘానిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. పురుషులు వెంట లేకుండా మహిళలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి
కాబూల్: అఫ్ఘానిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. పురుషులు వెంట లేకుండా మహిళలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదని, బాలికల సెకండరీ స్కూళ్లు మూసివేయాలని, మహిళలు ఉద్యోగాలు చేయకూడదంటూ ఆదేశాలు జారీచేసిన తాలిబన్ పాలకులు తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మహిళలకు యూనివర్సిటీ విద్యాపై నిషేధం విధించారు. మహిళలకు విద్యాబోధనను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్ నదీమ్ లేఖ రాశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆజ్ఞాపించారు.

అయితే తాలిబన్ల నిర్ణయంపై అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. మహిళలకు యూనివర్సిటీ విద్యపై నిషేధం విధించడం, బాలికల సెకండరీ స్కూల్ మూసివేయడం, మహిళలు, బాలికలపై ఆంక్షలు విధించడం వంటివి వారి హక్కులు, స్వేచ్ఛను హరించడమేనని అమెరికా హోం శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళల హక్కులను ఇది కాలరాయడమేనని ఐక్యరాజ్య సమితిలో బ్రిటన్ రాయబారి బార్బరా వుడ్ వార్డ్ అన్నారు. మహిళలకు యూనివర్సిటీ విద్యను దూరంచేస్తూ తాలిబన్లు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | విభేదాలొచ్చాయని ఆ బంధాన్ని అత్యాచారంగా పరిగణించలేం : సుప్రీంకోర్టు
Double Bedroom Homes | పేదలకు అందని డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకే..!
Chinese Food | చైనీస్ ఫుడ్ వండేటప్పుడు పాత్రలపై మంటలు వస్తాయి.. ఎందుకని..?
Vatsala Rajagopal | ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ కన్నుమూత!
Kranthi Kiran | కరువు మండలాలుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

