బ్రస్సెల్స్, మే 18: నాటో కూటమిలో చేరడానికి స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు తమ దరఖాస్తులను బుధవారం అధికారికంగా నాటోకు అందజేశాయి. నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఇరు దేశాల రాయబారుల దగ్గర నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ‘ఇది చరిత్రాత్మక పరిణామం’ అని అభివర్ణించారు.
‘ఈ రోజు చాలా మంచి రోజు. మన భద్రతకు సంబంధించి ఇది కీలక క్షణం’ అని దరఖాస్తులను స్వీకరిస్తూ వ్యాఖ్యానించారు. కాగా,నాటోలో ఏదైనా దేశం సభ్యత్వం పొందాలంటే ఇప్పటికే సభ్యులుగా ఉన్న 30 దేశాలు ఆమోదం తెలపాలి. అయితే, స్వీడన్, ఫిన్లాండ్ చేరికపై టర్కీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. టర్కీని ఒప్పిస్తే ఈ రెండు దేశాలు నాటోలో చేరే ప్రక్రియ ఐదారు నెలల్లో పూర్తి కావొచ్చని భావిస్తున్నారు. ఫిన్లాండ్ సరిహద్దులకు అణ్వస్త్ర సామర్థ్యమున్న క్షిపణులను తరలిస్తున్నది.