మాస్కో: రష్యాలోని ఓ పాఠశాలలో కాల్పులు చోటుచేసుకోవడంతో 13 మంది మరణించారు. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. 24 మంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం ఇజెవ్స్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. ఓ దుండగుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో విద్యార్థులు పరుగులు తీశారు. అయినా దుండగుడు వారిపైకి కాల్పులు జరుపగా 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.