H-1b Visa | మూడేండ్ల పాటు హెచ్-1బీ వీసాల జారీ నిలిపివేత?.. పరిమితి కూడా 25 వేలకు తగ్గింపు!
H-1b Visa | హెచ్-1బీ వీసాల జారీపై అమెరికాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడేండ్ల పాటు హెచ్-1బీ వీసాల జారీని నిలిపివేయాలంటూ అమెరికా చట్టసభలో కాంగ్రెస్ సభ్యుడు ఎలిక్రేన్ బుధవారం కొత్త ఇమిగ్రేషన్ బిల్లు ప్రవేశపెట్టారు.
H-1b Visa | వాషింగ్టన్, ఏప్రిల్ 23 : హెచ్-1బీ వీసాల జారీపై అమెరికాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడేండ్ల పాటు హెచ్-1బీ వీసాల జారీని నిలిపివేయాలంటూ అమెరికా చట్టసభలో కాంగ్రెస్ సభ్యుడు ఎలిక్రేన్ బుధవారం కొత్త ఇమిగ్రేషన్ బిల్లు ప్రవేశపెట్టారు. ఇది హెచ్-1బీ వీసా భవిష్యత్పై మరోసారి సందేహాలను లేవనెత్తింది. ఈ ప్రతిపాదనకు పలువురు హౌస్ రిపబ్లికన్ సభ్యులు మద్దతు తెలిపారు. ఈ మూడేండ్ల నిషేధం వల్ల ఈ వ్యవస్థ పూర్తిగా పునర్ నిర్మాణమవుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు.
అయితే కార్మికులు, విద్యార్థులు, ప్రతిభావంతులైన విదేశీయులపై ఆధారపడే కంపెనీలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం ఉన్న హెచ్-1బీ వీసాల సంఖ్యను 65 వేల నుంచి 25 వేలకు తగ్గించడమే కాక, ప్రస్తుతమున్న పరిమితులను తొలగిస్తారు. లాటరీ విధానాన్ని వేతన ఆధారిత వ్యవస్థతో భర్తీ చేస్తారు. ఉద్యోగులు అవసరమైన కంపెనీలు తాము ఉద్యోగుల తొలగింపును చేపట్టలేదని, ఆ పోస్టుకు తగిన అర్హత కలిగిన అమెరికన్లు లభించ లేదని నిర్ధారించాలి. హెచ్-1బీకి కనీసం 200000 డాలర్ల వార్షిక వేతనం నిర్ణయించాలి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

