Sunita Williams | సునీతా విలియమ్స్ రాకపై సర్వత్రా ఉత్కంఠ.. నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే భూమికి
Sunita Williams | వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుష్ విల్మోర్ (Butch Wilmore) వారం రోజుల మిషన్ కోసం వెళ్లి సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
Sunita Williams | వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుష్ విల్మోర్ (Butch Wilmore) వారం రోజుల మిషన్ కోసం వెళ్లి సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్య కారణంగా 8 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వారిని భూమికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమవుతూ వస్తు్న్నాయి. దీంతో వీరి రాకపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే వీరు భూమి మీదకు తిరిగి రానున్నట్లు తెలిసింది.
రీ షెడ్యూల్ ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితే మార్చి చివరి వారం లేదా.. ఏప్రిల్ మొదటి వారంలో వీరుభూమిపైకి తిరిగి వస్తారని ఇప్పటికే నాసా తెలిపిన విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందే ఈ ఇద్దరు వ్యోమగాములు భూమికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యోమగాములను మార్చి 12 నాటికి భూమిపైకి తీసుకొచ్చేందుకు టార్గెట్‌గా పెట్టుకున్నట్లు నాసా వర్గాలు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. అంతరిక్షంలో చిక్కుకున్న ఈ ఇద్దరు వ్యోమగాములను తిరిగి రప్పించేందుకు స్పేస్ ఎక్స్ 10 మిషన్ కోసం గతంలో ఉపయోగించిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ (SpaceX Crew Dragon capsule)ను ఉపయోగించనున్నట్టు సమాచారం.
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ గతేడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైన్ (Boeing Starliner) స్పేస్‌షిప్‌లో ఐఎస్ఎస్కి వెళ్లారు. వారం రోజుల మిషన్ కోసం వెళ్లిన వ్యోమగాములు స్టార్‌లైర్‌లో సాంకేతిక లోపం కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. జూన్ 6న ఇద్దరూ వ్యోమగాములు ఐఎస్ఎస్లోకి వెళ్లగా.. అదే నెల 14న తిరిగి భూమిపైకి రావాలి. కానీ, స్టార్ లైనర్‌లో హీలియం లీకేజీ నేపథ్యంలో ప్రయాణం వాయిదా పడింది. ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది. ఇందు(NASA) కోసం స్పేస్ ఎక్స్ (SpaceX)తో కలిసి పనిచేస్తోంది. ఫిబ్రవరి 2025లో తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వాళ్లు మరోనెల రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది.
Also Read..
“Sunita Williams | రెండోసారి.. సునీతా విలియమ్స్ స్పేస్‌వాక్”
“Donald Trump | సునీతా విలియమ్స్‌ను భూమికి తీసుకొచ్చేందుకు మస్క్ సాయం కోరిన డొనాల్డ్ ట్రంప్”
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

