సంతకమూ కీలకమే
అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల విభాగం (యూఎస్సీఐఎస్) కొత్తగా కఠినమైన సంతక ధ్రువీకరణ విధానాన్ని అమలు చేయనుంది. దీని వల్ల హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులు, గ్రీన్‌కార్డు కోరుకునే వారు, విదేశీ కార్మికులను స్పాన్సర్ చేసే యజమానులపై తీవ్ర ప్రభావం పడనుంది.
- అమెరికాలో వీసా కోసం కఠినంగా ధ్రువీకరణ విధానం
- జూలై 10 నుంచి అమల్లోకి
వాషింగ్టన్, మే 17: అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల విభాగం (యూఎస్సీఐఎస్) కొత్తగా కఠినమైన సంతక ధ్రువీకరణ విధానాన్ని అమలు చేయనుంది. దీని వల్ల హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులు, గ్రీన్‌కార్డు కోరుకునే వారు, విదేశీ కార్మికులను స్పాన్సర్ చేసే యజమానులపై తీవ్ర ప్రభావం పడనుంది. సిగ్నేచర్ మిస్ అయితే వీసాను తిరస్కరించే అవకాశం ఉన్నది. అభ్యర్థులు చేతితో చేసిన సంతకం, స్కాన్డ్, ఫ్యాక్స్డ్, ఆథరైజ్డ్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్లను వినియోగించాలి. కాపీ-పేస్ట్, డిజిటల్, స్టాంప్డ్ వర్షన్లకు దూరంగా ఉండాలి. యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ శాఖ జారీ చేసిన ఈ తాత్కాలిక తుది నిబంధన ప్రకారం యూఎస్సీఐఎస్కు అపరిమితమైన అధికారాలు సంక్రమిస్తాయి. వీసా ప్రక్రియ కోసం అప్పటికే అనుమతించినా కూడా తర్వాత ఆ దరఖాస్తులు చెల్లినివిగా గుర్తిస్తే వాటిని తిరస్కరించే, నిరాకరించే హక్కు వారికి ఉంటుంది. మే 11న ఫెడరల్ రిజిస్టర్లో ముద్రించిన ఈ నిబంధనలు ఈ ఏడాది జూలై 10 నుంచి అమల్లోకి వస్తాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

