గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన స్ట్రాబెర్రీ.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
అటువంటి స్ట్రాబెర్రీ తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. అయినా.. స్ట్రాబెర్రీలో ఏముందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్
స్ట్రాబెర్రీ తెలుసు కదా. చూడటానికి ఎరుపు రంగులో ఉంటాయి. చూడగానే లటక్కున నోట్లో వేసుకోవాలని అనిపిస్తుంది. అటువంటి స్ట్రాబెర్రీ తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. అయినా.. స్ట్రాబెర్రీలో ఏముందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిందంటారా? దానికి ఓ ప్రత్యేకత ఉంది లెండి.. అదేంటో తెలుసుకుందాం పదండి.

ఇజ్రాయెల్‌కు చెందిన ఏరియల్ చాహీ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత బరువైన స్ట్రాబెర్రీని పండించాడు. దీంతో ఆ స్ట్రాబెర్రీ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. దాని బరువు ఎంతో తెలుసా? 289 గ్రాములు. అంటే.. పావుకిలో కంటే ఎక్కువే. సాధారణంగా ఉండే స్ట్రాబెర్రీలు 50 గ్రాముల కంటే ఎక్కువ ఉండవు. కానీ.. ఇది పావుకిలో కంటే ఎక్కువ ఉండటం వల్ల గిన్నిస్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది.

4 సెంటీమీటర్ల మందంతో 18 సెంటీమీటర్ల పొడవుతో 34 సెంటీమీటర్ల చుట్టుకొలతతో 289 గ్రాములు ఉన్న ఈ స్ట్రాబెర్రీని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించారు. ఇజ్రాయిల్‌లోని కదిమా జోరాన్ రీజియన్‌లో ఉన్న తన తోటలోనే ఏరియల్ చాహీ దీన్ని పండించాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

