ప్రపంచంలో ఇప్పటికీ మనిషి కనుక్కోలేకపోయిన జంతువువలు చాలా ఉన్నాయని కొందరు అంటారు. ఇప్పుడు ఈ వాదనలకు బలం అందించే ఒక ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఇక్కడి అమారిలో పట్టణంలో ఒక జూ ఉంది. ఆ జూ ముందు ఉన్న సీసీ కెమెరాల్లో ఒక జీవి కనిపిచంది.
రెండుకాళ్లపై నిలబడి ఉందా జీవి. ఈ ఫొటో చూసిన నెటిజన్లు అది నిజంగా వింత జీవేనా? లేక ఎవరైనా మనుషులే అలాంటి గెటప్‌లో వచ్చారా? అని ఆలోచిస్తున్నారు. గత నెల 21వ తేదీన అర్థరాత్రి పూట, తెల్లారిజామున ఈ జీవి పలుమార్లు ఇక్కడ కనిపించినట్లు సమాచారం. దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.