Bangladesh | అప్పటిదాకా సైలెంట్‌గా ఉంటే మంచిది.. హసీనాకు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ యూనస్ హెచ్చరిక
హింస ప్రజ్వరిల్లడంతో దేశం నుంచి పారిపోయి భారత్‌లో తల దాచుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనస్ హెచ్చరికలు జారీ చేశారు. దేశం నుంచి పారిపోయి ఇక్కడ తలదాచుకుంటూ ప్రకటనలు చేయడం పట్ల మండిపడ్డారు.
Bangladesh | ఢాకా: హింస ప్రజ్వరిల్లడంతో దేశం నుంచి పారిపోయి భారత్‌లో తల దాచుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనస్ హెచ్చరికలు జారీ చేశారు. దేశం నుంచి పారిపోయి ఇక్కడ తలదాచుకుంటూ ప్రకటనలు చేయడం పట్ల మండిపడ్డారు. భారత్ నుంచి ఆమె రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని, అది ఇరు దేశాలకు ఇబ్బంది కలిగిస్తుందని అన్నారు. ఆమెను తమకు అప్పగించాలని భారత్‌ను ఢాకా కోరేవరకు ఆమె మౌనంగా ఉండాలని హెచ్చరించారు. ఆయన పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు.
భారత్ ఆ ఆలోచనను విడనాడాలి
బంగ్లాలోని అవామీ లీగ్ పార్టీ తప్ప మిగతావన్నీ ఇస్లామిస్ట్ పార్టీలని, హసీనా లేకపోతే బంగ్లా మరో అఫ్గానిస్థాన్‌లా మారిపోతుందన్న ఆలోచనను భారత్ విడనాడాలని యూనస్ అన్నారు. హసీనా భారత్‌లో ఆశ్రయం పొందడంతో ఏ ఒక్కరూ సౌకర్యంగా లేరని, అందుకే తాము ఆమెను భారత్ నుంచి రప్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

