Sputnik V: డెల్టా వేరియంట్‌పై సమర్థంగా పని చేస్తున్న స్పుత్నిక్ వి!
ఇండియాలో సెకండ్ వేవ్‌కు కారణమై ఇప్పుడు అమెరికా, చైనా, ఆస్ట్రేలియాను వణికిస్తున్న కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌పై స్పుత్నిక్ వి ( Sputnik V ) వ్యాక్సిన్ 83 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురష్కో వెల్లడించారు.

మాస్కో: ఇండియాలో సెకండ్ వేవ్‌కు కారణమై ఇప్పుడు అమెరికా, చైనా, ఆస్ట్రేలియాను వణికిస్తున్న కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌పై స్పుత్నిక్ వి ( Sputnik V ) వ్యాక్సిన్ 83 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురష్కో వెల్లడించారు. అసలు కరోనా అన్ని వేరియంట్లపైనా తమ వ్యాక్సిన్ సమర్థంగా పని చేస్తున్నట్లు అటు వ్యాక్సిన్ తయారీదారులు కూడా చెప్పారు. తీవ్రమైన కొవిడ్ నుంచి ఈ వ్యాక్సిన్ 95 శాతం రక్షణ కల్పిస్తున్నట్లు కూడా మిఖాయిల్ తెలిపారు. కరోనా రాకుండా, డెల్టా వేరియంట్‌ను అడ్డుకోవడంలో స్పుత్నిక్ వి సమర్థంగా పని చేస్తోంది.
తాజా ఫలితాలు ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్ సామర్థ్యం 83 శాతమని తేల్చాయి. ఈ డేటాను క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన మా సహచరులు అందించారు అని మంత్రి మిఖాయిల్ చెప్పారు. కొవిడ్ కారణంగా ఆసుపత్రి పాలుకాకుండా కూడా స్పుత్నిక్ అడ్డుకుంటోందని ఆయన అన్నారు. ప్రపంచంలో కరోనా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌గా స్పుత్నిక్ వి.. రష్యా గుర్తింపు పొంది బుధవారంతో సరిగ్గా ఏడాది గడిచింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను ఇండియా సహా 50 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

