రాత్రివేళల్లోనూ సూర్యకాంతి.. అవసరమైనప్పుడు, అవసరమైన చోట సౌర వెలుగులు
త్వరలో రాత్రివేళల్లోనూ సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. అవసరమైనప్పుడు, అవసరమైన చోట సూర్యకాంతిని విక్రయిస్తామని అమెరికా కంపెనీ చెబుతున్నది. ఈ ప్రాజెక్టు కోసం హైదరాబాద్కు చెందిన స్టార్టప్ స్కైరూట్తో కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది.
- అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ సంస్థ ప్రణాళికలు
- హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్తో ఒప్పందం
వాషింగ్టన్, అక్టోబర్ 17 : త్వరలో రాత్రివేళల్లోనూ సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. అవసరమైనప్పుడు, అవసరమైన చోట సూర్యకాంతిని విక్రయిస్తామని అమెరికా కంపెనీ చెబుతున్నది. ఈ ప్రాజెక్టు కోసం హైదరాబాద్కు చెందిన స్టార్టప్ స్కైరూట్తో కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. రాత్రి వేళల్లోనూ భూమిపై నిర్దిష్ట ప్రాంతాలకు అవసరమైనప్పుడు సూర్యకాంతిని అందించేందుకు ఈ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందుకోసం కక్ష్యలో భారీ ప్రతిబింబ అద్దాలతో కూడిన ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహ ప్రయోగాల కోసం స్కైరూట్ ఏరోస్పేస్ సేవలను వినియోగించుకోనున్నది.
ప్రయోజనాలు ఇవీ..
విపత్తులు సంభవించిన ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు, గాలింపు కార్యక్రమాలకు వెలుతురు అందించడం, సౌరవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి సమయాన్ని పొడిగించడం వంటి అవసరాలకు ఈ సాంకేతికతను వినియోగించాలని సంస్థ భావిస్తున్నది. ఐదు కిలోమీటర్ల వెడల్పు గల ప్రాంతంలో అవసరమైనంత వెలుతురును అందించడం, దాని తీవ్రతను సర్దుబాటు చేయడం, ఎప్పుడైనా నిలిపివేయడం ఈ వ్యవస్థ ప్రత్యేకతలుగా సంస్థ పేర్కొంటున్నది. మారుమూల పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే సమయాన్ని పెంచడం, కీలక మౌలిక సదుపాయాల వద్ద వెలుతురు కల్పించి రక్షణ కార్యకలాపాలకు తోడ్పడటం, బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాలకు ప్రత్యేక అనుభూతిని అందించడం వంటి ప్రయోజనాలు దీని వల్ల కలుగుతాయని సంస్థ చెబుతున్నది.
స్కైరూట్ ద్వారా ఉపగ్రహాల ప్రయోగం
ఈ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్తో రెండు ఉపగ్రహ ప్రయోగాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్టు రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ వెల్లడించింది. ఈ ప్రయోగాలు స్కైరూట్ రూపొందించిన విక్రమ్ రాకెట్ల ద్వారా జరుగుతాయి. ‘అంతరిక్ష సాంకేతికతో భూమిపై కొత్త అవకాశాలను సృష్టించే వినూత్న ప్రయత్నాల్లో ముందున్న రిఫ్లెక్ట్ ఆర్బిటాల్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉంది. అవసరమైనప్పుడు సూర్యకాంతిని అందించాలన్న వారి ఆలోచనను స్కైరూట్ రాకెట్ల ద్వారా సాకారం చేసేందుకు ఎదురుచూస్తున్నాం’ అని స్కైరూట్ ఏరోస్పేస్ సీఈవో పవన్ చందన పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

