Solo Wedding | ఒంటరి పెండ్లి.. జపాన్‌లో ఇప్పుడిదే ట్రెండింగ్
జపాన్‌లో ‘ఒంటరి పెండ్లి’ కొత్త ట్రెండ్‌గా మారింది. యువతులు తమను తామే మనువాడుతున్నారు. సంప్రదాయబద్ధమైన పెండ్లి తంతు వదిలిపెడుతున్నారు. పెళ్లి కొడుకు ఉండని ఈ కొత్త పెండ్లి ట్రెండ్‌లో వివాహ తంతును అన్ని రకాల హంగు, ఆర్భాటాలతో నిర్వహిస్తున్నారు.
- సోలో హనీమూన్కూ వెళుతున్న యువతులు
Solo Wedding | టోక్యో: జపాన్‌లో ‘ఒంటరి పెండ్లి’ కొత్త ట్రెండ్‌గా మారింది. యువతులు తమను తామే మనువాడుతున్నారు. సంప్రదాయబద్ధమైన పెండ్లి తంతు వదిలిపెడుతున్నారు. పెళ్లి కొడుకు ఉండని ఈ కొత్త పెండ్లి ట్రెండ్‌లో వివాహ తంతును అన్ని రకాల హంగు, ఆర్భాటాలతో నిర్వహిస్తున్నారు. కొందరు యువతులు తమ జీవితంలో చాలా ముఖ్యమైన కార్యక్రమంగా దీనిని చేసుకుంటున్నారు. మరికొందరు సొగసైన తెల్లని గౌనును ధరిస్తున్నారు.
ఈ ట్రెండ్‌కు ఆద్యురాలు అడల్ట్ వీడియో స్టార్ మన సకుర. ఆమె 2019 మార్చిలో తనను తానే పెళ్లి చేసుకుంది. “నేను నా సొంత జీవితాన్ని గౌరవిస్తాను. ఆరోగ్యంగా ఉన్నా, రోగగ్రస్థురాలినైనా, నన్ను నేను ఎల్లవేళలా ప్రేమించుకుంటాను, నన్ను నేను సంతోషపరచుకుంటాను” అని ప్రతిజ్ఞ చేసింది. హనవోకా అనే యువతి కూడా ఏకాకి పెళ్లి చేసుకుంది.
“నన్ను నేను పెళ్లి చేసుకోవడమంటే, పురుషుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకోవడం లేదని కాదు” అని ఆమె చెప్పింది. వివాహిత మహిళలు కూడా ఒంటరి పెళ్లిళ్లు చేసుకోవడం విశేషం. మరోవైపు సంప్రదాయబద్ధమైన పెళ్లిళ్లు తగ్గిపోయినట్లు జపాన్ ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. అయితే సోలో వెడ్డింగ్స్ పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నదని తెలుస్తున్నది. ఏకాకి పెళ్లి చేసుకునేవారు సోలో హనీమూన్‌కు కూడా వెళ్తున్నారు!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

