‘టీకా వేయించుకున్న వారం వరకు వ్యాయామం వద్దు’

సింగపూర్: కరోనా టీకా వేయించుకున్న వారం రోజుల వరకు వ్యాయామానికి దూరంగా ఉండాలని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం సూచించింది. కరోనా వ్యాక్సినేషన్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సవరించిన మార్గదర్శకాలను ఈ మేరకు జారీ చేసింది. ప్రధానంగా 30 ఏండ్ల లోపు వారు ముందు జాగ్రత్త కోసం కరోనా టీకా తర్వాత వారం రోజుల వరకు వ్యాయామానికి దూరంగా ఉండాలని పేర్కొంది. ఫైజర్ సంస్థకు చెందిన బయోఎంటెక్ టీకా తొలి డోసును 16 ఏండ్ల బాలుడు జూన్ 27న తీసుకున్నాడు. కాగా, ఈ నెల 3న అతడు జిమ్‌లో బరువులు ఎత్తుతుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో సుమారు 12 మందికి గుండె సంబంధ సమస్యలు వచ్చినట్లు ఆ దేశ వైద్య అధికారులు గుర్తించారు. ఇందులో ఏడుగురు 30 ఏండ్ల వయసులోపు వారే.
ఇజ్రాయెల్, అమెరికాలో కూడా ఫైజర్ టీకా తీసుకున్న కొందరిలో ఇలాంటి సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త కోసం టీకా వేయించుకున్న వారం వరకు భారీ వ్యాయామాలకు దూరంగా ఉండాలని దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు సింగపూర్ ప్రభుత్వం సూచించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

