Sikh Girl | లండన్ లో 14 ఏళ్ల సిక్కు బాలికపై పాక్ గ్యాంగ్ అత్యాచారం.. నిందితుడి ఇంటిపై 200 మంది సిక్కుల దాడి
Sikh girl : ఇంగ్లండ్ రాజధాని లండన్ లో ఒక సిక్కు బాలికను పాకిస్తానీ గ్యాంగ్ అపహరించింది. అంతేకాదు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడింది. ఇది తెలిసిన సిక్కులు నిందితుల ఇంటిపై దాడి చేసి, ఆమెను రక్షించారు.
Sikh girl : ఇంగ్లండ్ రాజధాని లండన్ లో ఒక సిక్కు బాలికను పాకిస్తానీ గ్యాంగ్ అపహరించింది. అంతేకాదు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడింది. ఇది తెలిసిన సిక్కులు నిందితుల ఇంటిపై దాడి చేసి, ఆమెను రక్షించారు. మొత్తం 200 మందికిపైగా సిక్కులు ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘటన వెస్ట్ లండన్ లోని హూన్ స్లో ఏరియాలో జరిగింది. ఒక 14 ఏళ్ల సిక్కు బాలికను పాకిస్తానీ గ్యాంగ్ ఇటీవల ఎత్తుకెళ్లింది. ఆమెతో కొంతకాలంగా స్నేహంగా నటించిన పాక్ గ్యాంగ్ సభ్యులు.. బాలికకు మాయ మాటలు చెప్పి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. తాము ఉండే ఇంటికి తీసుకెళ్లి దాదాపు ఐదారుగురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర వేధింపులకు గురి చేశారు. బాలిక పారిపోయేందుకు ప్రయత్నించినా.. అడ్డుకుని, రూంలో బంధించారు. ఈ విషయం పోలీసులకు తెలిసినా సరిగ్గా స్పందించలేదు. దీంతో విషయం తెలిసిన సిక్కులు నెమ్మదిగా ఒక్కటయ్యారు. నిందితుడి ఇంటిని చుట్టుముట్టారు. దాదాపు 200 మందికిపైగా సిక్కులు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. బాలికను రక్షించేందుకు ప్రయత్నించారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. అందరూ కలిసి బాలికను రక్షించారు. నిందితుల వయసు 30-40 మధ్య ఉన్నట్లు తెలుస్తోంది.
A 16 year old Sikh girl was groomed by a Pakistani Muslim man in his 40s. He took her into his flat and raped her along with 6 other Pakistani men. Over 200 members of the Sikh community gathered outside the flat to get their daughter back. They didn’t bring swords or kirpans.… pic.twitter.com/EnfLltAbkM
— Rakesh Krishnan Simha (@ByRakeshSimha) January 14, 2026
కాగా.. ఇటీవల లండన్ లో పాక్ సహా కొన్ని దేశాలకు చెందిన వ్యక్తులు బ్రిటన్ లోని మహిళలపై అత్యాచారానికి పాల్పడే ఘటనలు బాగా పెరిగాయి. అందులోనూ సిక్కుల్ని పాక్ గ్యాంగ్స్ టార్గెట్ చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ దీనిపై హెచ్చరికలు చేస్తున్నా లండన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆ దేశ ప్రధాని కూడా దీనిపై స్పందించడం లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

