Shooting | ఐదుగురిని కాల్చిచంపి హంతకుడి ఆత్మహత్య.. అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం..!
Shooting | అగ్రరాజ్యం అమెరికా (America) లో మళ్లీ కాల్పుల (shooting) కలకలం రేగింది. లాస్ వెగాస్‌లోని రెండు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలో ఓ వ్యక్తి కాల్పులు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. వారిలో 13 ఏళ్ల బాలిక కూడా ఉంది.
Shooting : అగ్రరాజ్యం అమెరికా (America) లో మళ్లీ కాల్పుల (shooting) కలకలం రేగింది. లాస్ వెగాస్‌లోని రెండు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలో ఓ వ్యక్తి కాల్పులు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. వారిలో 13 ఏళ్ల బాలిక కూడా ఉంది.
ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు 47 ఏళ్ల ఎరిక్ ఆడమ్స్గా పోలీసులు గుర్తించారు. అయితే ఐదుగురిని కాల్చి చంపిన కొన్ని గంటల తర్వాత నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఒకే కాంప్లెక్స్‌లోని రెండు వేర్వేరు అపార్ట్మెంట్లలో అడమ్స్ కాల్పులు జరిపాడు.
కాల్పులకు గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. కాగా గత కొన్ని రోజులుగా అమెరికాలో వరుసగా చోటుచేసుకుంటున్న కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్లపై, కిరాణా దుకాణాలపై ఇలా ఎక్కడ పడితే అక్కడ దొంగలు, సైకోలు కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

