జలాలాబాద్‌లో పేలుళ్లు.. మరణించిన వారిలో తాలిబన్ అధికారులు

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌లో శనివారం మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో తాలిబన్ అధికారులతోపాటు ముగ్గురు చనిపోగా, 20 మంది గాయపడినట్లు సమాచారం. నంగర్హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్‌లో తాలిబన్ వాహనాల లక్ష్యంగా ఈ బాంబు పేలుళ్లు జరిగినట్లు స్థానిక అధికారులు టోలో న్యూస్‌కు తెలిపారు. తాలిబన్ దళాల వాహనాలు వెళ్తుండగా రోడ్డు పక్కన అమర్చిన మందుపాతరను పేల్చారని చెప్పారు.
గాయపడిన సుమారు 20 మందిని ఆసుపత్రికి తరలించారని, వీరిలో చాలా మంది పౌరులని హాస్పిటల్ అధికారులు వెల్లడించారు. కాబూల్‌కు 80 మైళ్ల దూరంలోని జలాలాబాద్‌లో జరిగిన ఈ దాడి తామే చేసినట్లు ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించలేదు. కాగా, ఆగస్ట్ 15న ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు మరోసారి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నప్పటి నుంచి ఆ దేశంలో పలు చోట్ల బాంబు పేలుళ్లు జరుతూనే ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

