H1B VISA| హెచ్1బీ వీసాలకు త్వరలోనే రెండో విడత లాటరీ
న్యూఢిల్లీ: 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ హెచ్1బీ వీసాల జారీకి త్వరలోనే రెండో విడత లాటరీని నిర్వహిస్తామని అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) శుక్రవారం వెల్లడించింది.
H1B VISA| న్యూఢిల్లీ: 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ హెచ్1బీ వీసాల జారీకి త్వరలోనే రెండో విడత లాటరీని నిర్వహిస్తామని అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) శుక్రవారం వెల్లడించింది. తొలి విడత లాటరీని ఈ ఏడాది మార్చిలో నిర్వహించారు. ‘2024 ఏడాదికి సంబంధించి హెచ్1బీ వీసా కోటాను పూర్తిచేసేందుకు మరిన్ని దరఖాస్తులను ఎంపికచేయనున్నాం. ఇదివరకే దరఖాస్తు చేసిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్స్ నుంచి లాటరీ విధానంలో వీటిని ఎంపికచేస్తాం’ అని యూఎస్సీఐఎస్ తెలిపింది.
హెచ్1బీ వీసా అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. విదేశాలకు చెందిన నిపుణులైన ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు ఈ వీసా వీలు కల్పిస్తుంది. భారత్, చైనాకు చెందిన ఐటీ నిపుణులు ఈ వీసా కోసం ఎక్కువగా పోటీపడుతుంటారు. యూఎస్సీఐసీ ఏటా 85000 హెచ్1బీ వీసాలను జారీచేస్తుంది. రెండో విడత లాటరీ ఎప్పుడు నిర్వహించబోయేదీ యూఎస్సీఐఎస్ స్పష్టంగా చెప్పనప్పటికీ, వచ్చే నెలలో లాటరీ నిర్వహించే అవకాశం ఉన్నదని సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

