SEC | భారతీయ అధికారులకు లంచాలు.. అమెరికన్ కంపెనీలకు ఎస్ఈసీ జరిమానాలు
భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చి, అక్రమంగా కాంట్రాక్టులు పొందాయనే ఆరోపణలతో పలు అమెరికన్ కంపెనీలకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(ఎస్ఈసీ) భారీగా జరిమానాలు విధించింది. మూంగ్ ఐఎన్‌సీ, ఒరాకిల్ కార్పొరేషన్, అల్బేమర్లే కార్పొరేషన్ వంటి సంస్థలు భారత్‌లో కాంట్రాక్టులు పొందేందుకు రైల్వే, హెచ్ఏఎల్, ఐఓసీ అధికారులకు లంచాలు ఇచ్చాయని ఎస్ఈసీ పేర్కొన్నది.
- రైల్వే, హెచ్ఏఎల్, ఐఓసీ అధికారులకు భారీగా లంచాలు ఇచ్చినట్టు ఆరోపణలు
- చెల్లించి విచారణను తప్పించుకున్న సంస్థలు
SEC | న్యూయార్క్, డిసెంబర్ 16 : భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చి, అక్రమంగా కాంట్రాక్టులు పొందాయనే ఆరోపణలతో పలు అమెరికన్ కంపెనీలకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(ఎస్ఈసీ) భారీగా జరిమానాలు విధించింది. మూంగ్ ఐఎన్‌సీ, ఒరాకిల్ కార్పొరేషన్, అల్బేమర్లే కార్పొరేషన్ వంటి సంస్థలు భారత్‌లో కాంట్రాక్టులు పొందేందుకు రైల్వే, హెచ్ఏఎల్, ఐఓసీ అధికారులకు లంచాలు ఇచ్చాయని ఎస్ఈసీ పేర్కొన్నది. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఎస్ఈసీ.. లంచాలు ఇచ్చిన మొత్తంపై 300 శాతం వరకు పెనాల్టీలు చెల్లించాలని ఆదేశించింది. విచారణ నుంచి బయటపడేందుకు ఆయా అమెరికన్ కంపెనీలు ఈ జరిమానాలను ఎస్ఈసీకి చెల్లించి సెటిల్ చేసుకున్నాయి. భారత్‌లో ప్రభుత్వ అధికారులకు అదానీ సంస్థలు లంచాలు ఇచ్చాయని అమెరికాలో అభియోగాలు నమోదైన నేపథ్యంలో ఎస్ఈసీ చర్యలు కీలకంగా మారాయి.
దక్షిణ మధ్య రైల్వే అధికారులకు లంచాలు?
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), భారతీయ రైల్వే అధికారులకు 4.24 కోట్ల లంచాలు ఇచ్చిందని మూంగ్ ఐఎన్‌సీ అనే సంస్థపై ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థ భారత్‌లో మూంగ్ మోషన్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని నిర్వహిస్తున్నది. దక్షిణ మధ్య రైల్వే నుంచి ఓ కాంట్రాక్టును పొందేందుకు ఈ కంపెనీ 2020లో రైల్వే అధికారులతో పాటు రిసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అధికారులకు లంచాలు చెల్లించిందని అక్టోబరు 11న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎస్ఈసీ పేర్కొన్నది. హెచ్ఏఎల్ నుంచి రూ.11 కోట్ల కాంట్రాక్టును పొందడానికి ఓ అధికారికి 2.5 శాతం లంచం ఇచ్చినట్టు తెలిపింది. ఈ ఆరోపణల నేపథ్యంలో రూ.14 కోట్ల జరిమానాను ఎస్ఈసీకి మూంగ్ సంస్థ చెల్లించి రాజీ కుదుర్చుకుంది.
వందల కోట్ల జరిమానాలు
2019లో భారతీయ రైల్వే సహా పలు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 50 కోట్ల మేరకు లంచాలు ఇచ్చిందనే ఆరోపణ కేసులో ఒరాకిల్ సంస్థ రూ.195 కోట్ల జరిమానాను చెల్లించింది. 2009 నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) అధికారులతో పాటు ఇండోనేషియా, వియత్నాం అధికారులకు రూ.539 కోట్ల లంచం ఇచ్చిందనే ఆరోపణల కేసులో అల్బేమర్లే కార్పొరేషన్ రూ.1,680 కోట్ల జరిమానాను చెల్లించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

